ఐపిఎల్‌లో భాగంగా గురువారం లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరాజయం చవిచూసింది. ఉప్పల్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగిన పోరులో లక్నో ఐదు వికెట్ల తేడాతో హైదరాబాద్‌ను చిత్తు చేసింది. లక్నోకు ఇది తొలి విజయం కాగా, సన్‌రైజర్స్ మొదటి పరాజయం చవిచూసింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఓపెనర్ ట్రావిస్ హెడ్ 28 బంతుల్లో ఐదు ఫోర్లు, 3 సిక్సర్లతో 47 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
నితీశ్ రెడ్డి (32), క్లాసెన్ (26), అంకిత్ వర్మ 13 బంతుల్లో ఐదు సిక్సర్లతో 36 పరుగులు చేశారు. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 16.1 ఓవర్లలోనే కేవలం ఐదు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఓపెనర్ మిఛెల్ మార్ష్, నికోలస్ పూరన్ అద్భుత బ్యాటింగ్‌తో లక్నోను గెలిపించారు. మార్ష్ 7 ఫోర్లు, రెండు సిక్స్‌లతో 52 పరుగులు చేశాడు. ఇక విధ్వంసక ఇన్నింగ్స్ ఆడిన పూరన్ ఆరు సిక్స్‌లు, మరో 6 ఫోర్లతో 26 బంతుల్లోనే 70 పరుగులు సాధించాడు. చివర్లో సమద్ 8 బంతుల్లోనే అజేయంగా 22 పరుగులు చేసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు.