- Advertisement -
రానున్న ఐపిఎల్ సీజన్‌లో లక్నో సూపర్‌జెయింట్స్ మెరుగైన ప్రదర్శన చేయడం ఖాయమని ఆ జట్టు ఓనర్ సంజీవ్ గొయెంకా జోస్యం చెప్పారు. రిషబ్ పంత్ చేరికతో తమ జట్టు మరింత బలోపేతంగా మారిందన్నారు. అతని కోసం భారీ మొత్తం చెల్లించామన్నారు. పంత్ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడుతాడని ఆశిస్తున్నట్టు వివరించారు. లక్నో టీమ్‌లో ప్రతిభావంతులైన ఆటగాళ్లకు కొదవలేదన్నారు. పంత్, పూరన్, మిఛెల్ మార్ష్, మార్‌క్రమ్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు తమకు అందుబాటులో ఉన్నారన్నారు. ఇక కెప్టెన్‌ను ఎవరిని నియమించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. తమ జట్టులో సారథ్యం వహించే ఆటగాళ్లు చాలా మందే ఉన్నారని సంజీవ్ పేర్కొన్నారు.
- Advertisement -