Saturday, November 23, 2024

నేడు గుజరాత్‌తో లక్నో ఢీ

- Advertisement -
- Advertisement -

లక్నో: ఐపిఎల్‌లో అత్యంత నిలకడైన ప్రదర్శన చేస్తున్న లక్నో సూపర్‌జెయింట్స్‌, గుజరాత్ టైటాన్స్ జట్ల మధ్య శనివారం కీలక పోరు జరుగనుంది. ఈ సీజన్‌లో రెండు జట్లు కూడా అద్భుత ఆటను కనబరుస్తున్నాయి. అయితే గుజరాత్ పోల్చితే లక్నో మరింత మెరుగైన ప్రదర్శన చేస్తోంది. ఇప్పటి వరకు ఆరు మ్యాచ్‌లు ఆడిన లక్నో నాలుగింటిలో విజయం సాధించింది. అంతేగాక పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో కొనసాగుతోంది. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో లక్నో చాలా బలంగా ఉంది. కెప్టెన్ కెఎల్ రాహుల్ జట్టును ముందుండి నడిపిస్తున్నాడు. మరో ఓపెనర్ మేయర్స్ కూడా బాగానే ఆడుతున్నాడు. స్టోయినిస్, అయూష్ బడోని, నికోలస్ పూరన్, దీపక్ హుడా, కృనాల్ పాండ్య తదితరులతో లక్నో బ్యాటింగ్ చాలా బలంగా ఉంది.

అంతేగాక మార్క్‌వుడ్, రవి బిష్ణోయ్, ఉనద్కట్, కృష్ణప్ప గౌతమ్ తదితరులతో బౌలింగ్ విభాగం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. దీంతోపాటు సొంత గడ్డపై ఆడుతుండడం కూడా లక్నోకు సానుకూల పరిణామమే. ఈ మ్యాచ్‌లో కూడా గెలిచి పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకోవాలనే పట్టుదలతో లక్నో ఉంది. ఇక గుజరాత్‌ను కూడా తక్కువ అంచనా వేయలేం. శుభ్‌మన్ గిల్, వృద్ధిమాన్ సాహా, డేవిడ్ మిల్లర్ అద్భుత ఫామ్‌లో ఉన్నారు. సాయి సుదర్శన్ కూడా నిలకడగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కెప్టెన్ హార్దిక్ పాండ్య రూపంలో మ్యాచ్ విన్నర్ ఆల్‌రౌండర్ ఉండనే ఉన్నాడు. షమి, రషీద్ ఖాన్, జోసెఫ్, విజయ్ శంకర్‌లతో గుజరాత్ చాలా బలంగా ఉంది. దీంతో ఈ మ్యాచ్‌లో హార్దిక్ సేనకు కూడా గెలుపు అవకాశాలు బాగానే కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News