Sunday, January 19, 2025

లక్నో విధ్వంసం

- Advertisement -
- Advertisement -

మొహలి : ఐపిఎల్ తాజా సీజన్‌లో శుక్రవారం పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో జట్టు విధ్వంసం సృష్టించింది. సీజన్‌లో అత్యధిక 257 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఐపిఎల్ చరిత్రలో బెంగళూరు జట్టు 23ఏప్రిల్ 2013న పుణెపై సాధించి స్కోరు 263 తర్వాత ఇదే భారీ స్కోరు కావడం విశేషం. అనంతరం లక్ష్యఛేదనలో 19.5ఓవర్లలో 201పరుగులుచేసి కుప్పకూలడంతో లక్నో 56పరుగుల తేడాతో గెలిచింది. కాగా మ్యాచ్‌లో టాస్ గెలిచిన బౌలింగ్ ఎంచుకుని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయింది. సూపర్ జెయింట్స్ బ్యాటర్లు పరుగుల వరద పారించారు.

నిర్ణీత 5వికెట్లకు 257పరుగులు నమోదు చేశారు. కెప్టెన్ కెఎల్ రాహుల్ కేవలం 12పరుగులకే వెనుదిరిగిన మేయర్స్ 24బంతుల్లో 7ఫోర్లు, 4సిక్సర్లుతో 54పరుగులు, బదాని 3ఫోర్లు, 3సిక్సులతో 43పరుగులుతో ఆకట్టుకోగా బ్యాట్‌తో రెచ్చిపోయాడు. 40బంతుల్లో 6ఫోర్లు, 5సిక్సులతో 72పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్‌తో అలరించాడు. వికెట్ కీపర్ పూరన్ కూడా స్కోరుబోర్డును పరుగెత్తించాడు. 19బంతుల్లో 7ఫోర్లు, ఓ సిక్స్‌తో 45పరుగులు చేసి అదరగొట్టాడు. లక్నో బ్యాటర్లు సమష్టిగా రాణించి పంజాబ్ బౌలర్లకు చుక్కలు చూపించారు. పంజాబ్ బౌలర్లలో రబాడ రెండు వికెట్లు తీయగా సామ్‌కరన్, లివింగ్‌స్టోన్ తలో వికెట్ పడగొట్టారు.

ధావన్‌కు స్టొయినిస్ షాక్

లక్నో నిర్దేశించిన భారీ లక్ష ఛేదనలో పంజాబ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ పంజాబ్ కెప్టెన్‌ను శిఖర్ ధావన్ ఒక్క పరుగుకే వెనుదిరిగాడు. స్టొయినిస్ బౌలింగ్‌లో ధావన్ కృనాల్‌పాండ్యకు క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. మూడు పరుగులకే పంజాబ్ కీలక తొలి వికెట్ కోల్పోయింది. ప్రభ్‌సిమ్రన్‌సింగ్ (9) కూడా ఎక్కువసేపు క్రీజులో నిలవలేకపోయాడు. పవర్‌ప్లే ముగిసేసరికి 55పరుగులు చేసి రెండు వికెట్లు కోల్పోయింది. అనంతరం సికిందర్ రాజా లివింగ్‌స్టోన్ 23, సామ్ కరన్ 21, వికెట్‌కీపర్ జితేశ్‌శర్మ వెనుదిరిగారు. అయితే అప్పటికే గెలుపు లక్నో వైపు మళ్లిపోవడంతో పంజాబ్ బ్యాటర్లు పోరాడినా ఫలితం దక్కలేదు. ఈక్రమంలో అథర 36బంతుల్లో 8ఫోర్లు, 2సిక్సులతో 66పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. 19ఓవర్లలో పంజాబ్ 199/9 స్కోరు నమోదు చేసింది. మొత్తంమీద జట్టు 19.5ఓవర్లలో 201పరుగులు చేసి ఆలౌటైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News