Monday, December 23, 2024

ఆర్‌సిబిపై లక్నో ఉత్కంఠ విజయం

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: నరాలు తెగే ఉత్కంఠత మధ్య సాగిన హోరాహోరీ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ ఒక వికెట్ తేడాతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుపై సంచలన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరు 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 212 పరుగులు సాధించింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి విజయాన్ని అందుకుంది. ఒక దశలో 105 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో చిక్కుకున్న లక్నోకు నికోలస్ పూరన్ విధ్వంసక ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

సునామీ ఇన్నింగ్స్ ఆడిన పూరన్ 19 బంతుల్లోనే 7 సిక్సర్లు, మరో 4 ఫోర్లతో 62 పరుగులు చేశాడు. మరోవైపు మార్కస్ స్టోయినీస్ 6 సిక్స్‌లు, ఆరు ఫోర్లతో 65 పరుగులు చేసి తనవంతు పాత్ర పోషించాడు. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన బెంగళూరును ఓపెనర్లు కోహ్లి (61), డుప్లెసిస్ 79 (నాటౌట్), మాక్స్‌వెల్ (59)లు ఆదుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News