Monday, January 20, 2025

లక్నో సూపర్ విక్టరీ

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌పై 33 పరుగుల తేడాతో విజయం

అహ్మదాబాద్ : గుజరాత్‌పై లక్నో సునయాన విజయం సాధించింది. నిప్పులు చెరిగే బంతులతో యష్ ఠాకూర్ (4/26), కృనాల్ పాండ్య (2/11) చెలరేగడంతో లక్నో నిర్ధేశించిన లక్షానికి 33 పరుగుల దూరంలో కుప్ప కూలింది. దాంతో గుజరాత్ సొంత గ్రౌండ్‌లో ఘోర ఓటమిని మూటగట్టుకోవలసి వచ్చింది. గుజరాత్ బ్యాటర్లలో సాయి సుదర్శన్(31), రాహుల్ తెవాటియా(30)లు తప్ప మరెవరూ రాణించలేక పోయారు. అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ దిగిన లక్నో మార్కస్ స్టొయినిస్ (43 బంతుల్లో 58) మినహా మరెవరూ పెద్దగా రాణించకపోవడంతో లక్నో సూపర్ జెయింట్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. కెప్టెన్ కేఎల్ రాహుల్ (33), పూరన్ (32), ఆయుష్ బదోని (20) మాత్రమే రెండంకెల స్కోరు చేయగా, డికాక్ (6), పడిక్కల్ (7) నిరాశ పర్చారు. గుజరాత్ బౌలర్లలో దర్శన్, ఉమేశ్ చెరో 2 వికెట్లు తీయగా.. జాన్సన్ ఒక వికెట్ పడగొట్టాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News