లక్నో: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో మరో ఉత్కంఠభరితమైన మ్యాచ్‌కు లక్నో వేదికైంది. గుజరాత్ టైటాన్స్, లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరిగిన ఈ పోరు ఆఖరి ఓవర్ వరకూ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు నష్టపోయి.. 180 పరుగులు చేసింది. 181 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో ఓపెనర్‌లు మార్క్‌రం, పంత్‌లు కలిసి తొలి వికెట్‌కు 65 పరుగులు జోడించారు.
అయితే పసిద్ధ్ బౌలింగ్‌లో పంత్(21) ఔట్ కావడంతో బ్యాటింగ్‌కి దిగిన నికోలస్ పూరన్.. మార్క్‌రంతో కలిసి మైదానంలో బౌండరీల వర్షం కురిపించాడు. అయితే 123 పరుగుల స్కోర్ వద్ద మార్క్‌రం(58) ఔట్ అయ్యాడు. ఆ తర్వాత కూడా పూరన్ దూకుడుగా బ్యాటింగ్ చేశాడు. 34 బంతుల్లో 1 ఫోరు ఏడు సిక్సులతో 61 పరుగులు చేశాడు. కానీ రషీద్ ఖాన్ బౌలింగ్‌లో పూరన్.. షారుఖ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో స్కోర్ కాస్త నెమ్మదించింది. గుజరాత్ బౌలర్లు లక్నో ఇన్నింగ్స్‌ను ఆఖరి ఓవర్ వరకూ తీసుకువచ్చారు. ఆఖరి ఓవర్‌లో ఆరు పరుగులు కావాల్సి ఉండగా.. ఆయుష్ బదోని ఒక ఫోరు, ఒక సిక్సు బాది జట్టుకు విజయాన్ని అందించాడు.