Monday, December 23, 2024

ముంబయిపై గెలిచిన లక్నో

- Advertisement -
- Advertisement -

ముంబయి: ఐపిఎల్‌లో భాగంగా వాంఖండే స్టేడియంలో ముంబయి ఇండియన్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఘన విజయ సాధించింది. ముంబయిపై 18 పరుగుల తేడాతో గెలిచింది. పాయింట్లలో పట్టికలో లక్నో 14 పాయింట్లతో ఆరో స్థానంలో ఉండగా ముంబయి 8 పాయింట్లతో చివరి స్థానంలో ఉంది. లక్నో జట్టు నికోలస్ పూరన్(75), రాహుల్(55) ధాటిగా ఆడి 214 పరుగులు చేసింది. ముంబయి బ్యాట్స్ మెన్లలో రోహిత్ శర్మ(68), నమన్ ధిర్(62) హాఫ్ సెంచరీలతో కదం తొక్కారు. మిగితా బ్యాట్స్ మెన్ల నుంచి సహకారం లేకపోవడంతో ముంబయి 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 196 పరుగులు చేసింది. నికోలస్ 29 బంతుల్లో ఎనిమిది సక్స్‌లు, ఐదు ఫోర్లతో 75 పరుగులు చేసి విజయంలో కీలక పాత్ర పోషించడంతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News