Thursday, January 23, 2025

ప్లేఆఫ్‌కు లక్నో

- Advertisement -
- Advertisement -

Lucknow won on kolkata

ముంబై: ఐపిఎల్‌లో కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ ప్లేఆఫ్ బెర్త్‌ను సొంతం చేసుకుంది. బుధవారం ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో లక్నో రెండు పరుగుల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ను ఓడించి నాకౌట్‌కు దూసుకెళ్లింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్‌జెయింట్స్ నిర్ణీత ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 210 పరుగులు చేసింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, కెఎల్.రాహుల్ అసాధారణ బ్యాటింగ్‌తో కోల్‌కతా బౌలర్లను హడలెత్తించారు. ఈ జోడీని విడగొట్టేందుకు ప్రత్యర్థి బౌలర్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక డికాక్ ఆకాశమే హద్దుగా చెలరేగి పోయాడు.

నైట్‌రైడర్స్ బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల వరద పారించాడు. అతన్ని కట్టడి చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. వరుస ఫోర్లు, సిక్సర్లతో అలరించిన డికాక్ 70 బంతుల్లోనే 10 భారీ సిక్సర్లు, మరో పది బౌండరీలతో 140 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ రాహుల్ 4 సిక్సర్లు, మరో 3 ఫోర్లతో 68 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. ఈ క్రమంలో ఇద్దరు తొలి వికెట్‌కు అజేయంగా 210 పరుగులు జోడించి ఐపిఎల్‌లో కొత్త రికార్డును నెలకొల్పారు.

ఈ ఫార్మాట్‌లో తొలి వికెట్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం విశేషం. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా చివరి బంతి వరకు పోరాడినా ఫలితం లేకుండా పోయింది. నిర్ణీత ఓవర్లలో కోల్‌కతా 8 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. ఈ ఓటమితో కోల్‌కతా నాకౌట్‌కు దూరమైంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News