Sunday, April 27, 2025

టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో

- Advertisement -
- Advertisement -

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా.. ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో లక్నో సూపర్ ‌జెయింట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఈ సీజన్‌లో ఆరంభంలో తడబడిన ముంబై జట్టు తిరిగి తన ఫామ్‌ని పుంజుకొని వరుస విజయాలతో దూసుకుపోతుంది. మరోవైపు పాయింట్ల టేబుల్‌లో ముంబై కిందనే ఉన్న లక్నో.. ఈ మ్యాచ్‌లో గెలిచి మెరుగైన స్థానం దక్కించుకోవాలని భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టులో ఒక మార్పు చేసింది. శార్ధూల్ స్థానంలో మయాంక్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంది. మరోవైపు ముంబై తమ జట్టులో రెండు మార్పులు చేసింది. శాంట్నర్ స్థానంలో కర్న్ శర్మ జట్టులోకి రాగా.. కార్బిన్ బాష్ ఈ మ్యాచ్‌తో ఆరంగేట్రం చేస్తున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News