Thursday, December 26, 2024

ఓటిటిలోకి వచ్చేస్తున్న ‘లక్కీ భాస్కర్’

- Advertisement -
- Advertisement -

మహానటి, సీతా రామం వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు సినీ ప్రియులలో పేరు తెచ్చుకున్న హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడు కొత్త సినిమా లక్కీ భాస్కర్ తో దీపావళి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అందుకున్నాడు. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన చిత్రం లక్కీ భాస్కర్. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై తెరకెక్కించారు.

ఈ సినిమా కధ, కధనం తో వెంకీ అద్భుతంగా తీశారు. ఇక హీరో దుల్కర్ సల్మాన్ తనదైన యాక్టింగ్ తో తెలుగు సినీ ప్రేక్షకులను మెప్పించాడు. దీంతో సినిమా చుసిన ప్రతి ఒక్కరు సూపర్ హిట్ అంటూ చెప్పడంతో సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్కు పరుగుపెట్టారు. దీంతో ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది. థియేటర్స్ లో మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. నవంబర్ 28 నుంచి లక్కీ భాస్కర్ సినిమా నెట్ ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమ్ కానున్నది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. కాగా ఈ మూవీ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News