Sunday, December 22, 2024

లక్కు ఎవరికో.. కిక్కు ఎవరికో..!?

- Advertisement -
- Advertisement -

సంగారెడ్డి : మద్యం షాపులకు లక్కీ డ్రాను నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. గ తంలో ఎన్నడూ లేని విధంగా ఈ సారి మద్యం షాపులకు పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి.సంగారెడ్డి జిల్లా వ్యా ప్తంగా ఉన్న 101 మద్యం షాపులకు గాను 6156 దరఖాస్తులు వచ్చాయి. దీంతో షాపుల వారీగా లక్కీ డ్రా తీ సేందుకు జిలా ఆబ్కారీ శాఖ వారు ఏర్పాట్లు చేస్తున్నారు. సంగారెడ్డిలోని పెప్సీ వెనుక భాగంలో ఉన్న ఫంక్షన్ హాలులు లక్కీ డ్రా కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రతి దరఖాస్తు దారు కానీ, ఆయన తరపున ఒకరు కానీ ఖచ్చితంగా డ్రా సమయంలో హాజరుకావాలని జిల్లా ఎక్సైజు సూపరింటెండెంట్ గాయత్రి తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా పూర్తి పారదర్శకంగా లక్కీ డ్రాను నిర్వహిస్తున్నామని ఆమె వివరించారు. ప్రభుత్వ నిబంధనల మేరకు డ్రా కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయని పేర్కొన్నారు. సంగారెడ్డి, ఆందోల్, పటాన్‌చెరు, జహీరాబాద్, నారాయణఖేడ్ ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలోని ప్రతి దరఖాస్తుదారు లక్కీ డ్రాలో ఉండే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు.

పుల్కల్ మండలం సింగూరు మద్యం షా పునకు అత్యల్పంగా 22 దరఖాస్తులు రాగా, అమీన్‌పూర్ మద్యం షాపునకు 161 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. ఎక్సైజు స్టేషన్ల వారీగా, షాపుల వారీగా దరఖాస్తు దారులందరి సమక్షంలో లక్కీ డ్రా ఉంటుందని గాయత్రి తెలిపారు.వేలాది మంది వచ్చే అవకాశమున్నందున వా రికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కనీస వసుతులు కల్పిస్తున్నారు. ఇదిలా ఉంటే లక్కీ డ్రాలో మద్యం షాపుల ను దక్కించుకునేందుకు ఈ సారి కొన్ని సిండికేట్లు రంగంలోకి దిగాయి. ఇంతకు ముందు మద్యం వ్యాపారంలో ఉన్న వారికి మరికొందరు తోడై భారీ సిండికేట్లు ఏర్పాటయినట్లు తెలుస్తోంది. సంగారెడ్డిలో ఒక వైన్ షాపు, ఒక బార్ అండ్ రెస్టారెంటు ఉన్న వ్యాపారి ఒక సిండికేట్ ద్వారా ఈసారి 100 వరకు దరఖాస్తులు వేసినట్లు తెలిసింది. ఇక హైద్రాబాద్ కు చెందిన కొందరు మద్యం వ్యాపారులు కూడా ఈ సారి సంగారెడ్డి జిల్లాలో రంగంలోకి దిగారు. రాష్ట్ర రాజధానికి పక్కనే ఉండడం, పక్కనే కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దులుండడంతో పాటు రియల్ ఎస్టేట్ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఇలాంటి వారు ఈ సారి దరఖాస్తులు సమర్పించినట్లు తెలిసింది.

ఇంతకు మందు సంగారెడ్డి ప్రాంతంలో కల్లు వ్యాపారంలో ఉన్న వారు కూడా ఈ సారి పెద్ద ఎత్తున పోటీలో నిలిచినట్టు తెలుస్తోంది. రానున్నది ఎన్నికల సీజన్ కావడంతో దరఖాస్తు దారులు పెద్ద ఎత్తున పోటీ పడ్డారు. ఈ కారణంగానే అంచనాకు మించి సంగారెడ్డి జిల్లాలో 6156 దరఖాస్తులు వచ్చాయి. కేవలం ఈ దరఖాస్తుల ద్వారానే 123 కోట్ల 12 లక్షల ఆదాయం ఆబ్కారీ శాఖకు వచ్చింది. ఇదిలా ఉంటే లక్కీడ్రా కోసం ఆదివారం సాయంత్రం నుంచే చాలా మంది దరఖాస్తు దారులు సంగారెడ్డికి చేరుకున్నారు.ఈ కారణంగా పట్టణంలోని అనేక హోటళ్లు, లాడ్జిలు నిండిపోయాయని తెలుస్తోంది.సంగారెడ్డికి సమీపంలోని వారు సోమవారం ఉదయానికి చేరకునే అవకాశముంది. లక్కీ డ్రాలో తమకు షాపు దక్కాలని అంతా కోరుకుంటున్నారు. కొందరేమో తామే షాపును నడిపేందుకు సిద్దం కాగా..మరి కొందరేమో షాపును గెలవగానే అధిక ధరకు ఇతరులకు విక్రయించాలన్న ఆలోచనలో ఉన్నారు. ఆ విధంగా కొంత లాభ పడవచ్చన్నది వారి ఆశ..! ఇంతకు ఎవరి ఆశలు నెరవేరుతాయో..లక్కు ఎవరికి దక్కుతుందో..చూడాలి!

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News