Monday, December 23, 2024

మద్యం దుకాణాలకు మొదలైన లక్కీ డ్రా ప్రక్రియ..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మద్యం దుకాణాల లక్కీ డ్రా ప్రక్రియ మొదలైంది. జిల్లా కలెక్టర్ల ఆధీనంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలకు లక్కీ డ్రా ప్రక్రియ కొనసాగుతుంది. దీంతో లక్కీ డ్రా సెంటరకు మద్యం వ్యాపారులు పోటెత్తారు. పాసులు జారీ చేసిన వారికి మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. లక్కీ డ్రా జరిగే ప్రాంతాల్లో భారీగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు.

లక్కీ డ్రా కొనసాగే ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అంబర్పేట్ రానా ప్రతాప్ ఫంక్షన్ హాల్లో కొనసాగుతున్న లక్కీ డ్రాకు హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ హాజరయ్యారు. దరఖాస్తు దారుని మాత్రమే అధికారులు లోపలికి అనుమతిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News