Saturday, December 28, 2024

త్రిప్తి డిమ్రికి లక్కీ ఆఫర్

- Advertisement -
- Advertisement -

బాలీవుడ్ క్లాసిక్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న సూరజ్ భర్జత్యా హమ్ ఆప్‌కే హై కౌన్, మైనే ప్యార్ కియా, ప్రేమ్ రతన్ ధన్ పాయో సినిమాలతో తన మార్క్ ఏంటో చూపించాడు. సూరజ్ భర్జత్యా 35 ఏళ్ల కెరీర్ లో కేవలం 7 సినిమాలు మాత్రమే చేశాడు. అంతేకాదు ఆయన సినిమాల్లో హీరో పాత్ర పేరు కూడా ఒకటే పెడుతూ వచ్చాడు. ఆయన సినిమాలో హీరో పేరు ప్రేమ్. ఇక 2022లో ఉంచై సినిమా తర్వాత మరో కొత్త సినిమాతో త్వరలో సెట్స్ మీదకు వెళ్లబోతున్నాడు సూరజ్. ఈ సినిమాలో ప్రేమ్ పాత్రలో ఆయుష్మాన్ హీరోగా ఫిక్స్ అయ్యాడు. ఇక హీరోయిన్‌గా కూడా యానిమల్ సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న త్రిప్తి డిమ్రిని తీసుకుంటున్నారని తెలిసింది. సూరజ్ సినిమాలో హీరోయిన్ పాత్ర చాలా స్పెషల్‌గా ఉంటుంది. ప్రేమ్‌కి ప్రేయసిగా త్రిప్తి నటించనుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News