Sunday, November 24, 2024

బాలీవుడ్‌లో లక్కీ ఆఫర్

- Advertisement -
- Advertisement -

Lucky offer from Bollywood for Ruhani Sharma

 

తెలుగులో ‘చిలసౌ’ సినిమాతో పరిచయమై ‘డర్టీ హరి’ సినిమాలో నటించి మెప్పించిన రుహాని శర్మకు బాలీవుడ్ నుండి పిలుపు వచ్చింది. ఈ అమ్మడు తెలుగులో మెల్ల మెల్లగా పాతుకుపోతున్న సమయంలో తమిళంలో కూడా ఆమెకు ఆఫర్లు వస్తున్నాయి. నటిగానే కాకుండా తన అందచందాలతో కూడా రుహాని శర్మ ఆకట్టుకుంటోంది. ఈ సమయంలో ఈ బ్యూటీకి బాలీవుడ్‌లో లక్కీ ఆఫర్ వచ్చింది. తెలుగులో రుహాని శర్మ… విశ్వక్ సేన్‌కు జోడీగా హిట్ సినిమాలో నటించిన తర్వాత రెండు, మూడు ఆఫర్లు వచ్చాయి. ఈ సమయంలో బాలీవుడ్‌లో ఒక సినిమా చేసేందుకు ఆమె కమిట్ అయింది. బాలీవుడ్ యంగ్‌స్టర్ విక్రాంత్ మాసై హీరోగా నటిస్తున్న ఈ సినిమాతో దేవాంగ్ భవసార్ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News