Wednesday, January 22, 2025

లక్కీ ఆఫర్లు

- Advertisement -
- Advertisement -

Lucky offers to Shruti Hassan in Tollywood

 

నిన్నా మొన్నటి వరకూ శృతిహాసన్ ఓ అవుట్‌డేటెడ్ హీరోయిన్. పెద్ద హీరోల సినిమాలకు ఆమె పేరుని ఏమాత్రం పరిగణలోనికి తీసుకునేవారు కాదు. అయితే ‘క్రాక్’తో ఆమె దశ తిరిగింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యిం ది. వకీల్ సాబ్‌లోనూ తను కనిపించేసరికి.. ఒక్కసారిగా లక్కీ హీరోయిన్‌గా మారిపోయింది. ఇప్పుడు బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లోని సినిమాలో కూడా ఆమె హీరోయిన్. మరోవైపు మెగాస్టార్ చిరంజీవితోనూ జోడీ కట్టే అవకాశం దక్కించుకుందని తెలిసింది. చిరు, బాబి కాంబోలో ఓ సినిమా రూపుదిద్దుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో శృతిని కథానాయికగా ఎంచుకున్నారని టాక్ వినిపిస్తోంది. ఓకవైపు బాలయ్యతో సినిమా, మరోవైపు చిరంజీవితో సినిమా అంటే మాటలు కాదు. ఈ సినిమాలతో తను మరోసారి స్టార్ హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయినట్టే. వరుసగా రెండు పెద్ద సినిమాల ఆఫర్లు, అందులోనూ అగ్ర కథానాయకులతో నటించడంతో శృతి టాప్ హీరోయిన్‌గా మారే అవకాశం ఉంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News