ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌ను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఘన విజయంతో ప్రారంభించింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి మ్యాచ్‌లో డిఫెండిగ్ ఛాంపియన్స్ కెకెఆర్‌ను చిత్తుగా ఓడించింది. ఈ మ్యాచ్ విజయంలో జట్టు స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషించాడు. 36 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 59 పరుగులు చేసి ఒకసారిగా వింటేజ్ కోహ్లీని గుర్తు చేశాడు. అయితే మ్యాచ్ విజయం తర్వాత కోహ్లీపై ఆర్‌సిబి కెప్టెన్ రజత్ పటిదార్ ప్రశంసల వర్షం కురిపించాడు. కోహ్లీ లాంటి ఆటగాడు జట్టులో ఉండటం అదృష్టమని పటిదార్ అన్నాడు. అతని లాంటి ఆటగాడు జట్టులో ఉంటే కెప్టెన్ పని సులువవుతుందని.. అతని నుంచి ఆట గురించి నేర్చుకోవడానికి ఇది తనకు దొరికిన గొప్ప అవకాశమని పేర్కొన్నాడు. ఇక మ్యాచ్ విజయంలో భాగస్వామ్యులైన అందరిని కెప్టెన్ మెచ్చుకున్నాడు. ఇలాగే ఆడుతూ పోతే.. టైటిల్ తమకే సొంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఇక ఆర్‌సిబి తర్వాతి మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడనుంది. మార్చి 28న చెన్నై వేదికగ ఈ మ్యాచ్ జరుగనుంది.
కోహ్లీ లాంటి ఆటగాడు ఉండటం అదృష్టం: ఆర్‌సిబి కెప్టెన్
- Advertisement -
- Advertisement -
- Advertisement -