న్యూఢిల్లీ: గోవా మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నాయకుడు లూయిజిన్హో ఫలీరో బుధవారం కోల్‌కతాలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆయన పార్టీలో చేరిన ఈ వేడుకకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, తృణమూల్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ, పశ్చిమ బెంగాల్ రాష్ట్ర మంత్రి సుబ్రతా ముఖర్జీ హాజరయ్యారు.
లూయిజిన్హో ఫలీరో కాంగ్రెస్ పార్టీకి, గోవా అసెంబ్లీకి రాజీనామా చేసిన కొన్ని రోజులకే తన నమ్మకస్తుల గ్రూపుతో మంగళవారం కోల్‌కతా చేరుకున్నారు. తన భవిష్యత్తు గురించి పెదవి విప్పలేదు. అయితే తృణమూల్ కాంగ్రెస్‌కు మద్దతునిస్తానన్నారు.
తన పార్టీలో చేరిన గోవా నాయకుడిని స్వాగతించిన మమతా బెనర్జీ ఈ సందర్భంగా మాట్లాడుతూ “మా పార్టీ చీలికలు తెచ్చే శక్తులతో పోరాడుతుంది, కొత్త నవోదయం కోసం పనిచేస్తుంది” అన్నారు.
ఫలీరోతోపాటు కాంగ్రెస్‌లో చేరిన వారిలో గోవా కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శులు యతీశ్ నాయక్, విజయ్ వాసుదేవ్ పోయ్, పార్టీ మాజీ కార్యదర్శులు మరియో పింటో డి సంతన, ఆనంద్ నాయక్, ఐదుగురు ఇతరులు ఉన్నారు. తృణమూల్ పార్టీలో చేరినవారిలో సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కవి శివదాస్ సోను, మహారాష్ట్రవాదీ గోమంతక్ పార్టీ నాయకుడు లావు మామ్లేదార్ కూడా ఉన్నారు.
తృణమూల్ కాంగ్రెస్‌లోకి లూయిజిన్హో ఫలీరో
- Advertisement -
- Advertisement -
- Advertisement -