Monday, December 23, 2024

స్వల్ప తేడాతో బ్రెజిల్ అధ్యక్ష పదవిని గెలుచుకున్న లులా

- Advertisement -
- Advertisement -

Brazil President Lula

సావో పౌలో: లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా ఆదివారం ఎన్నికలలో అధ్యక్షుడు జైర్ బోల్సోనారోను స్వల్ప తేడాతో ఓడించారు.  ఇది వామపక్ష మాజీ అధ్యక్షుడికి అద్భుతమైన పునరాగమనం, అంతేకాక దశాబ్దాలలో బ్రెజిల్‌లోని అత్యంత మితవాద ప్రభుత్వానికి చివరికి ముగింపు పలికింది.

మిస్టర్ లూలాకు 50.8% ఓట్లు పోలయ్యాయి, మిస్టర్ బోల్సోనారోకు 49.2% ఓట్లు వచ్చాయి, కాగా ఇప్పటి వరకు 99.1% ఓటింగ్ మిషన్లు లెక్కించబడ్డాయి, రేసు ఫలితాన్ని లెక్కలపరంగా నిర్వచించడానికి ఇది సరిపోతుందని సుప్రీం ఎలక్టోరల్ కోర్ట్ పేర్కొంది.

రియో డి జనీరోలోని ఇపనేమా పరిసరాల్లోని ప్రజలు, “ మారిపోయింది!” అని అరవడం వినబడింది.”అతను పేదలకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాలకు మేలుచేయగలవాడు.మేము ఇప్పటి వరకు ఆకలి బాధలతో ఉన్నాము.” అని పేద ఈశాన్య ప్రాంతంలోని మారన్‌హావో రాష్ట్రం నుండి వచ్చిన రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి లూయిజ్ కార్లోస్ గోమ్స్(65) అన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News