Wednesday, January 8, 2025

అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్: కెటిఆర్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్‌ః ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతోందని రాష్ట్ర ఐటి శాఖ మంత్రి కలకుంట్ల తారకరామారావు అన్నారు. సోమవారం మంత్రి కెటిఆర్ సమక్షంలో లూలూ గ్రూప్ పెట్టుబడుల కార్యాచరణను ప్రకటించింది.ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్‌ఫోర్ట్ అండ్ రిటైల్ రంగంలో ఈ సంస్థ పెట్టుబడులు పెట్టనుంది.

దేశంలో పెట్టుబడులు పెడుతున్న లూలూ గ్రూప్, తెలంగాణలోనూ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చినందకు ఈ సందర్భంగా మంత్రి కెటిఆర్ ఆనందం వ్యక్తం చేశారు.సిఎం కెసిఆర్ కృషితో రాష్ట్రం అన్ని రంగాల్లో దూసుకుపోతుందన్నారు. దేశంలోనే తెలంగాణ తలసరి ఆదాయం ఎక్కువని, వరి ఉత్పత్తిలో తెలంగాణ, దేశంలోనే నెంబర్ వన్‌గా ఉందని చెప్పారు. లూలూ గ్రూప్, తెలంగాణలో దశలవారిగా రూ.3వేల కోట్ల పెట్టుబడలు పెట్టనుంది.

Also Read: ఇరవై రాష్ట్రాలలో ఇలాంటి పాలన ఉందా?

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News