- Advertisement -
దుబాయి: యుఎఇకి చెందిన రిటైల్ దిగ్గజం లులూ గ్రూపు గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో రూ.2,000 కోట్ల పెట్టుబడితో ఓ భారీ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయనుంది. శనివారం సంస్థ ఒక ప్రకటనలో ఈ విషయం తెలియజేసింది. భారత్‌లో తమ వ్యాపారం విస్తరణలో భాగంగా గుజరాత్‌లోని అహ్మదాబాద్ సమీపంలో ఓ షాపింగ్ మాల్‌ను ఏర్పాటు చేయడానికి రూ.2,000 కోట్లు పెట్టుబడి పెట్టనున్నట్లు లులూ గ్రూపు ఆ ప్రకటనలో తెలిపింది. దీనికి సంబంధించి గుజరాత్ ప్రభుత్వంతో కంపెనీ ఒక అవగాహనా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు కూడా ఆ ప్రకటన తెలిపింది. లులూ గ్రూపునకు దేశంలో ఇప్పటికే మూడు మాల్స్ ఉన్నాయి. వచ్చే ఏడాది మార్చి నాటికి దేశంలో మరో రెండు మాల్స్‌ను తెరవాలని కంపెనీ భావిస్తోంది.
- Advertisement -