Thursday, December 19, 2024

లులూ రూ.3500 కోట్లు భారీ పెట్టుబడి

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం ఏర్పడిన తర్వాత తలసరి ఆదాయం రెట్టింపయ్యిందని మంత్రి కెటిఆర్ అ న్నారు. రాష్ట్రంలో 3.5 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్ప త్తి అవుతుందన్నారు. వరిసాగులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో ఉందన్నారు.హైదరాబాద్ బేగంపేటలోని ఐటిసి కాకతీయ హోటల్లో మంత్రి కెటిఆర్ సమక్షంలో లూ లూ గ్రూప్ రాష్ట్రంలో కార్యకలాపాలు ప్రారంభించింది. రూ.3500 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ వెల్లడించారు. ఫుడ్ ప్రాసెసింగ్, ఎక్స్‌ఫోర్ట్ కేంద్రం, షాపింగ్ మాల్‌ను ఈ గ్రూప్ ఏర్పాటు చేయనుంది. ఈ మేరకు మంత్రి కెటిఆర్ సమక్షంలో పెట్టుబడుల కార్యాచరణను ఆ సంస్థ ప్రకటించింది. మంత్రి కెటిఆర్ దావోస్ పర్యటనలో భాగంగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం కార్యకలాపాలను ప్రారంభించనున్నట్లు ఈ సంస్థ ప్రకటించింది.ఐటిసి కాకతీయ హోటల్లో మం త్రి కెటిఆర్ సమక్షంలో రాబోయే రోజుల్లో తాము చేపట్టనున్న కార్యకలాపాలను సోమవారం వెల్లడించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో లూలూ సంస్థ పె ట్టుబడులతో టూరిజం పెరుగుతుందనిభావిస్తున్నామన్నారు.
దేశంలో అతిపెద్ద ఆక్వా హబ్ సిద్ధమవుతోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుతో లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని మంత్రి కెటిఆర్ వెల్లడించారు. తెలంగాణలో పం డే పత్తి దేశంలోనే అత్యున్నతమయ్యిందన్నారు. చేపల ఉత్పత్తిలోనూ తెలంగాణ అగ్రస్థానంలో ఉందని మంత్రి కెటిఆర్ అన్నారు. దేశంలో అతిపెద్ద ఆక్వా హబ్ సిద్ధమవుతుందని ఆయన తెలిపారు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని ఆయన వెల్లడించా రు. రూ.300 కోట్లతో మెగా డెయిరీ ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగును లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. 10 వేల ఎకరాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ జోన్లు ఏర్పాటు చేస్తున్నామని ఆయ న వెల్లడించారు. తెలంగాణ ఆచరిస్తుందని, దేశం అనుసరిస్తుందని మంత్రి కెటిఆర్ వెల్లడించారు.
5రకాల విప్లవాలతో పెట్టుబడులకు గమ్యస్థానం
ప్రపంచ స్థాయి సంస్థ లులూ గ్రూప్ హైదరాబాద్‌లో పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వచ్చినందుకు ఆనందంగా ఉందని మంత్రి కెటిఆర్ హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 5 రకాల విప్లవాలతో తెలంగాణ పెట్టుబడులకు గ మ్యస్థానంగా మారిందని మంత్రి కెటిఆర్ స్పష్టం చేశారు. 9 ఏళ్ల అభివృద్ధిలో అగ్రపథంలో కొనసాగుతున్నామని మం త్రి తెలిపారు. ప్రపంచ స్థాయి సంస్థల పెట్టుబడులతో తెలంగాణ పర్యాటకంగా వృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నా రు. సిఎం కెసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అభివృద్ధిలో దూసుకుపోతుందని మంత్రి స్పష్టం చేశారు.
రూ.300 కోట్ల పెట్టుబడితో షాపింగ్ మాల్
లులూ గ్రూప్ చైర్మన్ యూసఫ్ అలీ భవిష్యత్‌లో తమ సం స్థ నగరంలో చేపట్టనున్న కార్యకలాపాల గురించి ఆయన వివరించారు. రూ.3,500 కోట్ల పెట్టుబడులతో ఫుడ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్‌ఫోర్ట్ కేంద్రాన్ని త్వరలోనే హైదరాబాద్‌లో ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే రూ.300 కోట్ల పెట్టుబడితో లులూ షాపింగ్ మాల్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తున్నామని, ఆ పనులు దాదాపు పూర్తైయినట్లు ఆయన వివరించారు. ఆగస్టు లేదా సెప్టెంబర్ మొదటి వారం నాటికి హైదరాబాద్‌లో లులూ మాల్‌ను ప్రారంభించనున్నట్లు ఆయన ప్రకటించారు. ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు మాంసం, మత్స్య ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News