- Advertisement -
తిరుమల: నేడు చంద్రగ్రహణం ఏర్పడనుండడంతో ప్రముఖ ఆలయాలన్నీ మూసివేశారు. చంద్రగ్రహణం కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా ఉంటే మరికొన్ని రాష్ట్రాల్లో పాక్షికంగా కనిపిస్తోందని పరిశోధకులు చెబుతున్నారు. ఇక హైదరాబాద్‌లోనూ గ్రహణం పాక్షికంగా కనిపిస్తుంది. నేడు చంద్రగ్రహణం దృష్ట్యా శ్రీవారి ఆలయ తలుపులు మూసివేశారు. దాదాపు 11 గంటల పాటు ఆలయ తలుపులు మూసి ఉంచనున్నట్లు టిటిడి ప్రకటించింది. మధ్యాహ్నం 2.39 నుంచి సాయంత్రం 6.27 వరకు చంద్రగ్రహణం పట్టనుంది. ఇవాళ ప్రత్యేక ప్రవేశ, వీఐపి బ్రేక్, ఎస్ఎస్ డి టికెట్లను టిటిడి రద్దు చేసింది.
తిరుమలలో నేడు పౌర్ణమి గరుడ సేవ రద్దు
చంద్రగ్రహణం కారణంగా పౌర్ణమి గరుడ సేవను టిటిడి రద్దు చేసింది. చంద్రగ్రహణం వల్ల అన్ని రకాల దర్శనాలు, ఆర్జిత సేవలు రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది. రాత్రి 7:30 నుంచి సర్వదర్శనానికి వచ్చే భక్తులకు అనుమతించనున్నట్లు తెలిపింది.
- Advertisement -