Monday, January 20, 2025

చైనాలో చాంద్రమాన కొత్త సంవత్సర సందడి ప్రారంభం

- Advertisement -
- Advertisement -

షాంఘై : చైనాలో చాంద్రమాన కొత్త సంవత్సర (లూనార్ న్యూ ఇయర్ ) వసంత కాల పండగ (చున్ యున్) సందడి ప్రారంభమైంది. 40 రోజుల పాటు సాగే ఈ పండగ మొదటి రోజు శనివారం కావడం విశేషం. ఈమేరకు అధికారికంగా జనవరి 21 నుంచి పబ్లిక్ హాలీడే అయినప్పటికీ 2020 నుంచి ఈ లూనార్ కొత్త సంవత్సర వేడుకలను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ పండగ కాలంలో స్వదేశీ ప్రయాణాలకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. చైనాలో జీరోకొవిడ్ పాలసీకి వ్యతిరేకంగా చారిత్రాత్మకంగా భారీ ప్రజాందోళనలు సాగడంతో గత నెల నుంచి జీరోకొవడ్ పాలసీని ఎత్తివేశారు. జీరోకొవడ్ పాలసీ అమలులో చైనాలో లాక్‌డౌన్లు తరచుగా ఏర్పడి ఆర్థికంగా చాలావరకు నష్టాలు ఏర్పడ్డాయి.

ఇప్పుడు మళ్లీ అన్నీ తెరుచుకోవడంతో గత ఏభై ఏళ్లుగా సాగుతున్న అత్యల్ప వృద్ధికి బదులుగా 17 త్రిలియన్ డాలర్ల మేరకు ఆర్థిక వృద్ది తిరిగి పుంజుకోగలుగుతామని పెట్టుబడి దారులు ఆశిస్తున్నారు. కానీ ఆకస్మిక మార్పుల ఫలితంగా చైనా 1.4 బిలియన్ జనాభాలో చాలా మంది వైరస్ బారిన పడ్డారు. కరోనా ఒమిక్రాన్ వేరియంట్ల ఫలితంగా ఆస్పత్రులు కరోనా బాధితులతో కిక్కిరిసి పోయాయి. ఫార్మసీ అల్మారాల మందులు ఖాళీ అయ్యాయి. మృతదేహాల అంత్యక్రియల కోసం బారులు తీర వలసి వచ్చింది. ఈ నేపథ్యంలో చైనా రవాణా మంత్రిత్వశాఖ ఈ పండగ సందర్భంగా రానున్న 40 రోజుల్లో 2 బిలియన్ ప్రయాణికులు అంతర్గతంగా స్వదేశీ ప్రయాణాలు చేసే అవకాశం ఉందని అంచనా వేసింది. 2019 నాటి ప్రయాణాల కన్నా 70.3 శాతం అత్యధికంగా ఉండవచ్చని పేర్కొంది. అయితే ఈ పండగ సందర్భంగా తమ స్వస్థలాలకు వెళ్లడానికి స్వేచ్ఛ లభించిందని కొందరు సంతోష పడగా, వైరస్ ఇన్‌ఫెక్షన్ల కారణంగా ప్రయాణాలు చేయలేమని మరికొందరు జంకుతున్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News