Wednesday, January 15, 2025

రుషికొండలో రహస్యంగా విలాస భవనాలు కట్టారు: గంటా

- Advertisement -
- Advertisement -

అమరావతి: రుషికొండలో రహస్యంగా విలాస భవనాలు కట్టారని టిడిపి ఎంఎల్‌ఎ గంటా శ్రీనివాస రావు మండిపడ్డారు. విశాఖపట్నంలో రుషికొండ భవనాలను ఎంఎల్‌ఎ గంటా శ్రీనివాస రావు పరిశీలించారు. ఎంఎల్‌ఎతో పాటు రుషికొండ భవనాలను కూటమి శ్రేణులు పరిశీలించాయి. ఈ సందర్భంగా గంటా మీడియాతో మాట్లాడారు. ముందు పర్యాటకం అన్నారని, తరువాత పరిపాలన భవనాలు అన్నారని, రూ. 450 కోట్ల ప్రజాధనం ఏం చేశారని ప్రశ్నించారు. వైఎస్‌ఆర్‌సిపి నాయకులకే ఈ కాంట్రాక్టు ఇచ్చారని, రుషికొండ భవనాలను సిఎం చంద్రబాబుకు చూపిస్తామని, రుషికొండ భవనాల విషయంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News