Tuesday, January 21, 2025

మెగా ప్రిన్సెస్‌కు లగ్జరీ రూమ్

- Advertisement -
- Advertisement -

టాలీవుడ్ స్టార్ హీరో రామ్‌చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులైన విషయం తెలిసిందే. ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ఇక తమ కూతురికి క్లింకారా అనే నామకరణం చేశారు. తాజాగా రామ్‌చరణ్, ఉపాసనలు తమ మెగా ప్రిన్సెస్ కోసం ఓ లగ్జరీ రూమ్‌ని ఏర్పాటు చేయడం విశేషం. దీనికి సంబంధించిన వీడియోని తాజాగా ఉపాసన స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇంట్లో తమ కుమార్తెకు ఆహ్లాదకరమైన వాతావరణం ఉండేలా ఇంటీరియర్ డిజైనింగ్ చేయించారు. ఈ మేరకు ప్రముఖ ఆర్కిటెక్ట్ పవిత్రా రాజారామ్ నేతృత్వంలో కామినేని నివాసంలోని క్లీంకార రూమ్‌ను స్పెషల్ గా డిజైన్ చేయించడం జరిగింది. అమ్రాబాద్ ఫారెస్ట్ వేదిక్ హీలింగ్ అంశాలను స్ఫూర్తిగా తీసుకుని ఈ ఇంటీరియర్‌ను సిద్ధం చేసినట్లు ఆమె తెలిపారు. ఇక లగ్జరీ రూమ్ వీడియో అందరినీ ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ లగ్జరీ రూమ్ అద్భుతంగా, అందంగా ఉందని అందరూ కామెంట్స్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News