Thursday, December 26, 2024

ఇటలీ దీవి వద్ద విలాస నౌక మునక

- Advertisement -
- Advertisement -

ఇటలీలోని సిసిలీ ఐలాండ్ వద్ద సముద్ర జలాల్లో విలాసవంతమైన నౌక మునిగిపోయింది. పెనుతుపాన్ తాకిడితో జరిగిన ఈ ఘటనలో ఇందులోని ఏడుగురు ప్రముఖుల జాడ తెలియకుండా పోయింది. గల్లంతయిన వారిలో బ్రిటన్‌కు చెందిన వ్యాపార దిగ్గజం మైక్ లించ్ కూడా ఉన్నారు. గల్లంతయిన వారిలో నలుగురు బ్రిటిషర్లు, ఇద్దరు అమెరికన్లు, ఓ కెనడియన్ ఉన్నట్లు ఇటలీ అధికారులు సోమవారం తెలిపారు.

కాగా ముప్పు నుంచి తప్పించుకున్న వారిలో లించ్ భార్య , మరో 14 మంది ఉన్నట్లు వెల్లడైంది. కన్పించకుండా పోయిన మైక్ టెక్నాలజీ సంబంధిత వ్యాపారంలో దిట్టగా ఉన్నారు. సిలిసి తీరం వద్దనే ఈ సూపర్‌యాచ్ నౌక బేయెసియన్ మునక జరిగింది. ఈ చిన్నపడవ ఈ నెల 14న బయలుదేరింది. పోర్టిసెల్లో తీరానికి వద్ద సముద్రం కల్లోలంతో మునిగిపోయినట్లు అధికారులు తెలిపారు. కాగా తమ అధినేత పరిస్థితి గురించి స్పందించేందుకు కంపెనీ అధికారులు నిరాకరించారు. పూర్తి స్థాయి నిర్థారణ తరువాత ప్రకటన ఉంటుందని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News