Wednesday, January 22, 2025

సినీరంగ స్ఫూర్తి ప్రదాత ఎల్.వి.ప్రసాద్: సిరికొండ మధుసూధనాచారి

- Advertisement -
- Advertisement -

LV Prasad 28th death anniversary celebration

హైదరాబాద్: సినీ రంగానికి స్పూర్తి ప్రదాత ఎల్.వి.ప్రసాద్ అని మాజీ స్పీకర్ , ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి కొని యాడారు. 1931 లో సినీరంగ ప్రవేశం చేసిన ఆయన తొలి తరం లో నటుడు గా, దర్శకుడు గా , నిర్మాత గా బహుముఖ ప్రజ్ఞాశాలి గా ఎదిగారన్నారు. బుధవారం బంజారా హిల్స్ లోని ప్రసాద్ లాబ్స్‌లో ఎల్.వి.ప్రసాద్ 28వ వర్ధంతిని ఆకృతి ఆధ్వర్యంలో ఘనంగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్.బి. ప్రసాద్ చిత్రానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు.నిర్మాత గా లాబ్స్ అధినేత గా సేవలు అందిస్తున్న ఎల్‌బి ప్రసాద్ కుమారుడు రమేష్ ప్రసాద్‌ను ఘనంగా సత్కరించారు. అనంతరం మధు సూదనాచారి మాట్లాడుతూ ఎన్.టి రామారావు లోని ప్రతిభని గుర్తించిన తొలి వ్యక్తి ఎల్.వి.ప్రసాద్ అని.అందుకే ఎన్.టి ఆర్ గొప్ప నాయకుడు గా ప్రసిద్ది చెందారు అన్నారు. తనను నిలబెట్టిన ప్రజల కోసం ఏదైనా చేయాలనే మానవీయ దృక్పథం కలిగిన మానవతా మూర్తి ఎల్వి ప్రసాద్ అని కొనియాడారు.

ఆయనలో పరిశీలకుడి తో పాటు ఒక పరిశోధకుడు కనిపిస్తారని, .అందుకే ఆయన పారిశ్రామిక వేత గా ఎదిగి ప్రపంచ ప్రఖ్యాత ఎల్.వి.ప్రసాద్ కంటి ఆస్పత్రిని మనకు అందించారు తెలిపారు. ప్రముఖ నిర్మాత ఎన్.ఆర్.అనూరాధ దేవి మాట్లాడుతూ ఆయన ప్రతిభ ను చూసి తమ సంస్ధ నిర్మించిన మనదేశం చిత్రానికి దర్శకత్వ బాధ్యతలు అప్పగించామని పేర్కొన్నారు.చాలా మందికి తెలియని విషయం ఎమిటంటే మూడు భాషల తొలి టాకీ చిత్రాల్లో నటించిన ఏకైక భారతీ య నటుడు ఎల్‌వి ప్రసాద్ అని చెప్పారు. హిందీ ఆలం ఆరా, తెలుగు భక్త ప్రహ్లాద,తమిళ కాళిదాస లో ఆయన నటించారు అన్నారు. రమేష్ ప్రసాద్ మాట్లాడుతూ తమ తండ్రి చూపిన మార్గంలో పయనించి ,ఎన్నో నూతన ఆవిష్కరణలు చేశామన్నారు..ప్రసాద్ ఐ మాక్స్ లాంటి ప్రతోస్తాకర ప్రాజెక్ట్ తెచ్చమన్నారు.. సభకు ఆకృతి సుధాకర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఫిక్కీ సిఎండీ అచ్యుత జగదీష్ చంద్ర, తమిళ నాడు తెలుగు ఫౌండేషన్ మేనేజింగ్ ట్రస్టీ, దేవరకొండ రాజు,ర్యాలీ నిర్మల తదితరులు పాల్గొన్నారు..

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News