- Advertisement -
హైదరాబాద్: ప్రముఖ గీత రచయిత గురు చరణ్(77) కన్నుమూశారు. ఆయన గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తెల్లవారుజామున తుది శ్వాస విడిచారని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ‘ముద్ద బంతి పువ్వులో మూగబాసలు’, ‘కుంతీకుమారి తన కాలు జారి’, ‘బోయవాని వేటకు గాయపడిన కోయిలా’ అనే సూపర్ హిట్ సాంగ్ మనకు అందించారు. రెండు వందలకు పైగా సినిమా పాటలను రాశారు. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ప్రతీ సినిమాకు పక్కగా ఒక పాటను రచించేవారు. అలనాటి ప్రముఖ నటి ఎం ఆర్ తిలకం, అలనాటి ప్రముఖ దర్శకుడు మానాపురం అప్పారావుల తనయుడు గురు. ఆయన ఎంఎ చదవిన తరువాత ప్రముఖ గీత రచయిత ఆచార్య ఆత్రేయ వద్ద పాటలు రచించడంలో శిష్యరికం తీసుకున్నారు. గురు చరణ్ కన్నుమూయడంతో టాలీవుడ్‌లో విషాదచాయలు అలుముకున్నాయి. టాలీవుడ్ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
- Advertisement -