- Advertisement -
మనతెలంగాణ/ హైదరాబాద్: యూనివర్సిటీ గ్రాంట్స్ చైర్మన్‌గా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మామిడాల జగదీష్ కుమార్‌ను నియమించారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వైస్-ఛాన్సలర్‌గా జగదీష్ కుమార్ విధులు నిర్వహిస్తున్నారు. యుజిసి చైర్మన్‌గా ఐదు సంవత్సరాలు కొనసాగుతారని కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులలో పేర్కొన్నారు. వీరి స్వస్థలం నల్లగొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల గ్రామం. ఇంటి పేరు.. ఊరుపేరు ఒక్కటే కావడం యాదృచ్చికం.
M Jagadish Kumar appointed as UGC Chairman
- Advertisement -