Monday, November 18, 2024

తమిళనాడులో ‘హిందీ మాసం’ ఉత్సవాలేమిటి? : ఎంకె.స్టాలిన్

- Advertisement -
- Advertisement -

స్థానిక భాషలకు గౌరవించమని ప్రధాని మోడీకి స్టాలిన్ లేఖ

చెన్నై: చెన్నై దూరదర్శన్ స్వర్ణోత్సవ వేడుకలతో పాటు ‘హిందీ మాసం’ వేడుకలను జరుపుకోవడాన్ని ఖండిస్తూ తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె. స్టాలిన్ శుక్రవారం ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు. స్టాలిన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసిన లేఖలో, హిందీయేతర రాష్ట్రాలలో ‘హిందీ మాసాన్ని’ జరుపుకోవడం ‘ఇతర భాషలను కించపరిచే ప్రయత్నమే’ అని పేర్కొన్నారు.

రాజ్యాంగం ఏ భాషకూ జాతీయ భాషా హోదాను కల్పించలేదు, అందువల్ల హిందీయేతర రాష్ట్రాలలో ఇటువంటి కార్యక్రమాలను నిర్వహించడం ‘నివారింపబడాలి’ అని సూచించారు. ఆయా రాష్ట్రాల్లో స్థానిక భాషల్లోనే వేడుకలు జరుపుకునే అవకాశం ఉండాలన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News