Wednesday, March 12, 2025

ఖర్గే ‘అవమానకర’ వ్యాఖ్యపై రాజ్యసభలో రభస

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : వివాదాస్పద జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి)పై చర్చ సమయంలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన అవమానకర వ్యాఖ్య మంగళవారం రాజ్యసభలో పెద్ద ఎత్తును రభసకు దారి తీసింది. చైర్‌పర్సన్ ఉద్దేశించి అమర్యాదకర భాష వాడినందుకు ఖర్గేను బిజెపి ఎంపిలు విమర్శించగా, ఆ వ్యాఖ్య ప్రభుత్వ విధానాలను ఉద్దేశించి చేసినదని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే వివరించారు. ఖర్గే ఆ వ్యాఖ్యకు క్షమాపణ చెప్పారు కూడా. ఆ వ్యాఖ్యను ఆ తరువాత రాజ్యసభ రికార్డుల్లో నుంచి తొలగించారు. విద్యా మంత్రిత్వశాఖ పని తీరుపై రాజ్యసభ చర్చను చేపట్టినప్పుడు ఎన్‌ఇపిలో త్రిభాషా సూత్రంపై వివాదం నేపథ్యంలో డిఎంకె ఎంపిలపై ‘అనాగరిక’ వ్యాఖ్య చేసినందుకు విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ క్షమాపణ చెప్పాలరి ప్రతిపక్షాలు ముక్తకంఠంతో కోరాయి.

ఆ గలభా మధ్య సభ ఉపాధ్యక్షుడు హరివంశ్ చర్చను ప్రారంభించవలసిందిగా కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్‌కు సూచించారు. అయితే, ఖర్గే జోక్యం చేసుకుని విద్యా శాఖ మంత్రిపై వ్యాఖ్యలు చేశారు. కూర్చోవలసిందిగా ఖర్గేను హరివంశ్ కోరినప్పేడు ‘ఇది నియంతృత్వం’ అని ఆయన విమర్శించారు. ఎన్‌ఇపి వివాదంపై ప్రభుత్వాన్ని ప్రతిపక్షం ఇరకాగంలో పెడుతుందని సూచించేందుకు ఖర్గే అప్పుడు అనియత హిందీ మాటను వాడారు. దీనితో అధికార పక్షం నుంచి అలజడి రేగింది. సభా నాయకుడు జెపి నడ్డా జోక్యం చేసుకుని, ఖర్గే వ్యాఖ్య గర్హనీయమని, అమర్యాదకరమైనదని అన్నారు. గలభా కొనసాగడంతో సభ ఉపాధ్యక్షుని ఉద్దేశించి ఖర్గే క్షమాపణ చెప్పారు. ‘అధ్యక్షుని ఉద్దేశించి నేను అటువంటి పదాలు వాడలేదు.

నా మాటలకు ఉపాధ్యక్షుడు నొచ్చుకుని ఉన్నట్లయితే క్షమాపణ చెబుతాను. అయితే, ప్రభుత్వ విధానాలను విమర్శిస్తున్నాను’ అని ఆయన పేర్కొన్నారు. ఆ తరువాత ఖర్గే ‘ఎక్స్’ పోస్ట్‌లో ‘ఈ దేశంలో ఒక భాగం, ఆ వర్గ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బ తీస్తున్న’ ప్రధాన్ వ్యాఖ్యలను ప్రస్తావించి ఆ వ్యాఖ్య చేశానని తెలిపారు. ‘అవి అనాగరికమైనవని, అమర్యాదకరమని మీరు అంటుంటే మంత్రిని రాజీనామా చేయవలసిందిగా కోరండి. మోడీ ప్రభుత్వం దేశాన్ని చీల్చడం గురించి మాట్లాడుతోంది. వారి దేశాన్ని విడగొట్టడం గురించి మాట్లాడుతున్నారు’ అని ఖర్గే అన్నారు. తమిళనాడు గట్టిగా వ్యతిరేకిస్తున్న ఎన్‌ఇపి కింద త్రిభాషా సూత్రం ఈ వివాదానికి మూల కారణం. తమిళనాడు అని అధికార డిఎంకె కాంగ్రెస్ ప్రభుత్వం దానిని రాష్ట్రంపై హిందీని రుద్తే యత్నంగా దీర్ఘకాలంగా భావిస్తోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News