Wednesday, January 22, 2025

‘జెంటిల్‌మన్ 2’తో తమిళ పరిశ్రమలో ఎం.ఎం. కీరవాణి

- Advertisement -
- Advertisement -

‘జెంటిల్‌మన్’ నిర్మాత కె.టి. కుంజుమోన్’ సౌత్ ఇండియన్ సినిమా ప్రముఖ నిర్మాతలలో ఒకరు. అద్భుతమైన చిత్రాలని నిర్మించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను అందించారు. శరత్‌కుమార్‌, దర్శకుడు శంకర్‌ వంటి గొప్ప ప్రతిభావంతులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన అరుదైన రికార్డ్ ఆయన సొంతం. గ్రాండ్ గా సినిమాలను నిర్మించడం, తన సినిమాలను ప్రమోట్ చేయడంలో ప్రత్యేకమైన శైలిని అనుసరించడంలో ఆయన పేరుపొందారు. ఇప్పుడు ‘జెంటిల్‌మన్ 2’ ద్వారా నిర్మాతగా ఆయన కమ్ బ్యాక్ గురించి ఇండస్ట్రీ, ట్రేడ్ సర్కిల్ మొత్తం ఆనందం వ్యక్తం చేస్తోంది.

ఎస్.ఎస్.రాజమౌళి ‘ఆర్‌ఆర్‌ఆర్‌’లోని నాటు నాటు’ పాటకు ‘బెస్ట్ ఒరిజినల్ సాంగ్’లో ఆస్కార్ అవార్డును గెలుచుకున్న కంపోజర్ ఎం.ఎం. కీరవాణి, ‘జెంటిల్‌మన్-2’ ద్వారా తమిళ చిత్ర పరిశ్రమలో కమ్ బ్యాక్ ఇస్తున్నారు. పూర్తి స్క్రిప్ట్‌ను ఎం.ఎం. కీరవాణికి వినిపించడానికి ఫిల్మ్ మేకర్ ఎ. గోకుల్ కృష్ణ హైదరాబాద్ వచ్చారు. కథ గ్రాండియర్‌ కి చాలా ఇంప్రెస్ అయిన కీరవాణి వచ్చే నెలలోనే కంపోజ్ చేయడం ప్రారంభిస్తానని నిర్మాత కుంజుమోన్ కు చెప్పారు. ఈ చిత్రాన్ని ఇంత గ్రాండ్‌గా నిర్మించబోతున్న నిర్మాత కె.టి. కుంజుమోన్ ని అభినందించారు కీరవాణి. ప్రస్తుతం కె.టి. కుంజుమోన్ ఈ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ చేయడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News