పుణె: ప్రతిపక్ష ఇండియా కూటమి నేతల అభ్యంతరాలను తోసిరాజని ఎన్‌సిపి అధినేత శరద్ పవార్ మంగళవారం ప్రధాని నరేంద్ర మోడీతో వేదికను పంచుకున్నారు. మంగళవారం పుణెలో జరిగన లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు ప్రదానోత్సవంలో ప్రధాని మోడీ అవార్డు అందుకోగా ఆ కార్యక్రమంలో శరద్ పవార్ పాల్గొనడం విశేషం.
అత్యున్నత నాయకత్వానికి, ప్రజలలో దేశభక్తి భావనను జాగృతం చేసినందుకు గుర్తింపుగా ప్రధాని మోడీకి లోకమాన్య తిలక్ అవార్డును ప్రదానం చేశారు.మోడీతో కలసి వేదికను పంచుకోవద్దంటూ ఇండియా కూటమి పక్షాలు చేసిన అభ్యర్థలను శరద్ పవార్ పట్టించుకోలేదు. అయితే..బిజెపికి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలన్నీ ఏకమవుతూ ఇండియా కూటమిని ఏర్పాటు చేసుకున్న తరుణంలో మోడీతో కలసి పవార్ కార్యక్రమంలో పాల్గొనడం తప్పుడు సంకేతాలను ప్రజలకు పంపుతుందని ప్రతిపక్ష నేతలు భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనవద్దని కోరేందుకు ప్రయత్నించిన ్రఇండియా కూటమి ఎంపీలను కలుసుకునేందుకు సైతం శరద్ పవార్ ఇష్టపడడలేదు.
1983లో ఈ అవార్డును నెలకొల్పడం జరిగింది. లోకమాన్య తిలక్ వారసత్వాన్ని గౌరవించేందుకు ప్రతి ఏటా ఆగస్టు 1న తిలక్ వర్ధంతి నాడు ఈ అవార్డు ప్రదానోత్సవం జరుగుతుంది.
ప్రధాని మోడీ రాకను నిరసిస్తూ వివిధ సామాజిక సంస్థలు, రాజకీయ పార్టీల నాయకులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రముఖ సామాజిక కార్యకర్త బాబా ఆదవ్ నాయక్తవంలో పలువురు నిరసనకారులు నల్లజెండాలతో ప్రధానికి స్వాగతం పలికారు.
==పుణె చేరుకున్న వెంటనే ప్రధాని మోడీ స్థానిక దగ్దూషెత్ హల్వాయి గణేశ్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అక్కడికి 300 మీటర్ల దూరంలో ఉన్న మండలై వద్ద ఇండియా కూటమి సభ్యులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. కాంగ్రెస్, శివసేన(ఉద్ధవ్ థాక్రే వర్గం), ఎన్‌సిపి(శరద్ పవార్ వర్గం) సభ్యులతోపాటు వివిధ సామాజిక సంస్థల కార్యకర్తలు ఈ నిరసనలో పాల్గొన్నారు.