Wednesday, January 22, 2025

పత్రికా రంగంలో ఎం.వెంకటేశ్వర్‌ రావు అందరికీ ఆదర్శం: స్పీకర్ గడ్డం ప్రసాద్

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ/హైదరాబాద్ : పత్రికా రంగంలో ఎం.వెంకటేశ్వర్‌రావు గత నాలుగు దశాబ్దాలుగా విలువలు పాటిస్తూ అందరికీ ఆదర్శంగా నిలిచారని శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ అన్నారు. తాను మండలాధ్యక్షుడిగా, శాసనసభ్యుడిగా మొదటిసారి ఎన్నికైనప్పటి నుంచి వెంకటేశ్వర్‌రావు తనకు తెలుసునని పేర్కొన్నారు.

సోమవారం రవీంద్రభారతిలో జరిగిన అతిథి మాసపత్రిక దశాబ్ది ఉత్సవాలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆర్.లింబాద్రి, వైస్ చైర్మన్ మహమూద్ అలీ, సీనియర్ ఐఎఎస్ అధికారి అజయ్ మిశ్రా, రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News