సత్యం రాజేష్, డా. కామాక్షి భాస్కర్ల హీరో హారోయిన్‌గా.. గెటప్ శ్రీను, రాకేందు మౌళి, బాలాదిత్య, సాహితి దాసరి, రవి వర్మ, చిత్రం శ్రీను, అక్షత శ్రీనివాస్ ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం మా ఊరి పొలి మేర-2. గౌరు గణబాబు సమర్పణలో గౌరికృష్ణ నిర్మాతగా రూపొందుతున్న ఈ చిత్రానికి డా.అనిల్ విశ్వనాథ్ దర్శకుడు. మా ఊరి పొలిమేర చిత్రానికి సీక్వెల్‌గా రూపొందుతున్న ఈ చిత్రం నవంబరు 3న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది. ప్రముఖ పంపిణీదారుడు వంశీకృష్ణ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ చిత్రం ట్రైలర్‌కు మంచి స్పందన వస్తుంది. ఈ ట్రైలర్‌కు వచ్చిన బజ్‌తో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న మా వూరి పొలిమేర -1 టాప్ పొజిషన్‌లోకి వచ్చింది. కాగా ఈ చిత్రంలోని పాత్రల పరిచయ కార్యకమ్రం బుధవారం గ్రాండ్‌గా జరిగింది. ఈ కార్యక్రమానికి చిత్రంలో కనిపించే పాత్రల గెటప్‌లతోనే సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల, రాకేందు మౌళి, బాలాదిత్య, తదితరులు హాజరుకావడం విశేషం.
ఈ సందర్భంగా సత్యం రాజేష్ మాట్లాడుతూ నటీనటులు అందరూ దిబెస్ట్ ఇచ్చారు. దర్శకుడు ప్రతిభ గురించి ఈ సినిమా ద్వారా అందరికి తెలుస్తుంది. నిర్మాత గౌరి కిష్ణ సినిమాకు ఏం కావాలో అది సమకూర్చారు. మార్కెట్‌కు మించి ఖర్చు పెట్టారు. సినిమాను చాలా క్వాలిటీగా నిర్మించారు. గ్యానీ సంగీతం, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. కొత్త కాన్సెప్టతో రూపొందిన ఈ చిత్రం ప్రేక్షకులను కొత్త లోకానికి తీసుకవెళుతుంది. వంశీ నందిపాటికి ఈ సినిమా నచ్చడం ఆయన ఈ సినిమాను విడుదల చేయడానికి ముందుకు రావడంతో సినిమా పెద్ద సినిమాగా మారింది. ఆయన ఎంట్రీతో ఈ సినమా రేంజ్ మారిపోయింది అన్నారు.
దర్శకుడు అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ నా సినిమాలో అన్ని పాత్రలు ప్రాముఖ్యత పాత్రలే. చిన్న సినిమాగా మొదలుపెట్టిన ఈ సినిమాకు ఇంత బజ్ రావడం ఆనందంగా వుంది. నాకు గుర్తింపు తెచ్చిన సినిమా ఇది. నిర్మాత కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమా మాకున్న పరిధిలో రిలీజ్ చేద్దాం అనుకున్నాం. వంశీ నందిపాటి చేరికతో ఈసినిమా పెద్ద సినిమాగా మారింది. పొలిమేర -1కు మించి 20 రెట్లు బాగుంటుంది వుంటుంది. త్వరలో పొలిమేర -3 పనులు మొదలుపెడతాం. ఇదంతా ఓ కలలా అనిపిస్తుంది. ఈ సినిమా ఎవరిని కావాలో వారిని తీసుకుంది. అంతా ఓ మ్యాజికల్‌గా జరిగిపోయింది. తప్పకుండా సినిమా అందరికి విపరీతంగా నచ్చుతుంది అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ ఈ సినిమాలో కొమర పాత్రతో పాటు కామాక్షి పాత్ర ఆలోచింపజేస్తుంది. నవంబరు 3న ఓ థిల్లింగ్ సినిమాను చూడబోతున్నారు. తప్పకుండా కొత్తదనం ఆశించే ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుంది అన్నారు. ఈ సినిమా విడుదల చేసే అవకాశం రావడం నాకు దక్కిన గొప్ప అవకాశంలా భావిస్తున్నాను అన్నారు.
కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ సినిమా విజయంఫై నాకు పూర్తి నమ్మకం వుంది. ఈ సినిమాకు పనిచేసిన అందరి పేర్లు మూవీ విడుదల తరువాత అందరికి గుర్తండిపోతాయి అన్నారు.
నిర్మాత మాట్లాడుతూ సినిమా విజయంపై నాకు పూర్తి నమ్మకం వుంది. వంశీ నందిపాటి సహకారంతో చాలా గ్రాండ్‌గా విడుదల చేస్తున్నాం. తప్పకుండా చిత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుంది అన్నారు. ఈ వేడుకలో బాలాదిత్య, రాకేందు మౌళి, గ్యానీ, కెమెరామెన్ ఖుషేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.