- Advertisement -
1947లో మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చే సమయంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా టాలీవుడ్ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ‘మా కాళీ’ అనే సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను మేకర్స్ విడుదల చేశారు.
భారతదేశం నుంచి పాకిస్థాన్ విభజన సమయంలో బంగ్లాదేశ్ లో ఉన్న హిందువులను అక్కడ ముస్లిమ్స్ ఎలా ఊచకోత కోసారు.. హిందువులు మతం మారడమో.. లేకపోతే చనిపోవడమే అన్నట్టు ముస్లింలు సృష్టించిన మరణ కాండను ఈ సినిమాలో చూపెట్టబోతున్నట్లు టీజర్ ను చూస్తే అర్థమవుతోంది. ఈ సినిమాను బెంగాలీతో పాటు హిందీ, తెలుగులో విడుదల చేయనున్నట్లు తెలిపారు. విజయ్ యెలకంటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల తేదిని త్వరలో ఖరారు వెల్లడించనున్నారు.
- Advertisement -