Monday, December 23, 2024

ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా “మాఊరి పొలిమేర’

- Advertisement -
- Advertisement -

“మాఊరి పొలిమేర’ చిత్రానికి సీక్వెల్‌గా రూపొందిన  చిత్రం “మా ఊరి పొలిమేర 2” డా.అనిల్ విశ్వనాథ్. ద‌ర్శ‌కుడు. సత్యం రాజేష్, కామాక్షి భాస్కర్ల ముఖ్యతారలుగా నటించిన ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. గౌరికృష్ణ నిర్మించిన ఈ చిత్రాన్ని  ప్రముఖ పంపిణీదారుడు వంశీ నందిపాటి  ప్రపంచవ్యాప్తంగా విడుదల చేశారు. విడుద‌లైన రోజు నుంచి ప్రేక్ష‌కాద‌ర‌ణ‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ విజ‌యం దిశ‌గా చిత్రం కొన‌సాగుతుంది. ఈ సంద‌ర్భంగా చిత్ర యూనిట్ థ్యాంక్స్ మీట్‌ను ఏర్పాటు చేసింది.

ఈ థాంక్స్ మీట్ కు విచ్చేసిన సక్సెస్ఫుల్ ప్రోడ్యుసర్ బన్నీ వాసు  గారు మాట్లాడుతూ : ఈ కార్యక్రమానికి నేను రావడానికి ముఖ్య కారణం సినిమా పైన నాకున్న నమ్మకం. వంశీ అలాగే ప్రొడ్యూసర్ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈరోజు ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి కారణం వీళ్ళిద్దరే. గత మూడు రోజులుగా మేము పడిన కష్టం ఎప్పుడు ఎలా రిలీజ్ ప్లాన్ అని మా కష్టాన్ని మర్చిపోయేలాగా ఈరోజు ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు.  సినిమాలో నటించిన అందరూ చాలా బాగా నటించారు సత్యం రాజేష్, కామాక్షి ఎవరికి వాళ్లు వాళ్ళ క్యారెక్టర్ కి న్యాయం చేశారు అన్నారు.

వంశీ నందిపాటి గారు మాట్లాడుతూ ఇందాక బన్నీ వాసు గారు అన్నట్టు మూడు రోజుల నుంచి మేము పడుతున్న కష్టం అంతా కూడా ఈరోజు ఈ సినిమా ఘనవిజయం చూసిన తర్వాత చాలా ఆనందంగా ఉంది మేము పడిన కష్టం అంతా మర్చిపోయాలా చేసింది అని అన్నారు. నన్ను ఇంతలా ప్రోత్సహించిన మా నాన్నగారికి నా ఫ్యామిలీకి నా ఫ్రెండ్స్ కి అలాగే ప్రత్యేకంగా బన్నీ వాసు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.

ప్రొడ్యూసర్ గౌరీ కృష్ణ గారు మాట్లాడుతూ నిజంగా అనీల్ గారు తీసిన సినిమా పైన మాకు చాలా నమ్మకాలు ఉన్న రిలీజ్ కి ఇబ్బంది పడిన ఈరోజు ఈ చిత్రం విజయం సాధించిన తర్వాత మేము చాలా సంతృప్తిగా ఉన్నామని అన్నారు. అలాగే మమ్మల్ని ముందు నుంచి ప్రోత్సహించిన వంశీ నందిపాటి గారికి అలాగే ఇప్పుడు విచ్చేసి ప్రోత్సహిస్తున్న బన్నీ వాసు గారికి కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ సినిమా ఇంత ఘనవిజయం సాధించడం చాలా ఆనందాన్ని కలిగిస్తుంది అలాగే మాకు ముందు నుంచి ప్రొడక్షన్ వైస్ సపోర్ట్ గా నిలిచిన మా ప్రొడ్యూసర్ గారికి అలాగే వంశీ నందిపాటి గారికి అండ్ మమ్మల్ని నమ్మి ఈ ప్రాజెక్టులో ముందుండి నడిపించిన బన్నీ వాసు గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అన్నారు.

హీరోయిన్ కామాక్షి భాస్కర్ల మాట్లాడుతూ నిన్నటి నుంచి కలెక్షన్ల మీద వస్తున్న రిపోర్ట్ చూసి చాలా హ్యాపీగా ఉంది అలాగే మమ్మల్ని మా ప్రొడక్షన్ టీం ని సపోర్ట్ చేసి రిలీజ్ కి కారణమైన వంశీ నందిపాటి గారికి ఈవెంట్ కి విచ్చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్న బన్నీ వాసు గారికి  ప్రత్యేక కృతజ్ఞతలు అన్నారు.

హీరో సత్యం రాజేష్ మాట్లాడుతూ చిన్న సినిమాగా పొలిమేర 1 ఓటీటీ రిలీజ్ అయ్యి ఈ రోజున బిగ్ స్క్రీన్ పైన పొలిమేర 2 ఇంతకు ఘన విజయాన్ని సాధించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. వంశి గారు అలాగే మా ప్రొడ్యూసర్ గారు ఈ సినిమా రిలీజ్ కి ఎంత కష్టపడ్డారు నాకు తెలుసు అండ్ అలాగే బన్నీ వాసు గారు నాకు ఎప్పటి నుంచో స్నేహితుడు ఆయన కూడా ఈ సినిమాకు సపోర్ట్ చేస్తూ మాకు రిలీజ్ కి అలాగే ఈ రోజుకి ఇక్కడికి విచ్చేసి మమ్మల్ని ప్రోత్సహించడం చాలా ఆనందంగా ఉంది అన్నారు. వంశీ గారికి బన్నీ వాస్ గారికి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News