Wednesday, January 22, 2025

‘మా’ నుంచి నటి హేమ సస్పెండ్

- Advertisement -
- Advertisement -

క్లీన్ చిట్ తో వస్తేనే సస్పెన్షన్ ఎత్తివేత

హైదరాబాద్: బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టయిన నటి హేమపై ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్’ (మా) సస్పెన్షన్ వేటు వేసింది. హేమను ‘మా’ నుంచి సస్పెండ్ చేయడానికి సభ్యుల అభిప్రాయాలు కోరుతూ ఆ సంఘం అధ్యక్షుడు మంచు విష్ణు బుధవారం మా గ్రూప్ లో మెసేజ్ పెట్టారు. అయితే సభ్యులంతా సస్పెండ్ చేయాల్సిందేనంటూ సమాధానం ఇవ్వడంతో హేమను సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. హేమ క్లీన్ చిట్ తో వచ్చే వరకు ఈ సస్పెన్షన్ కొనసాగనున్నది. వైద్య పరీక్షలో హేమకు పాజిటివ్ అని తేలినప్పటికీ ఆమె మాత్రం తాను తప్పు చేయలందంటూ వాదిస్తోంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News