- Advertisement -
హైదరాబాద్: ఇటీవల జరిగిన మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎలక్షన్స్ లో ప్రకాశ్‌రాజ్ ప్యానల్ నుంచి గెలుపొందిన 11మంది సభ్యుల రాజీనామాలను అధ్యక్షుడు మంచు విష్ణు ఆమోదించారు. ఈ సందర్భంగా విష్ణు మాట్లాడుతూ.. రాజీనామాలు చేయొద్దని, పంపిన లేఖలు వెనక్కి తీసుకోవాలని కోరినప్పటికీ వాళ్లు అంగీకరించలేదని, అందుకే వారి రాజీనామాలను ఆమోదించానని పేర్కొన్నారు. ఇక, ప్రకాష్ రాజ్, నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేసి పంపించిన లేఖలను ఆమోదించలేదని తెలిపారు.
MAA President Vishnu accepted 11 Members Resignations
- Advertisement -