Wednesday, April 16, 2025

మూడు రోజుల్లో మాడవీధుల స్థలసేకరణ

- Advertisement -
- Advertisement -

శ్రీరామ నవమి రోజున భద్రాచలంలో
విస్తరణ పనులు ప్రారంభం నవమి
ఏర్పాట్లు పరిశీలించిన అనంతరం మంత్రి
పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మన తెలంగాణ/భద్రాద్రి కొత్తగూడెం: వచ్చేనెల 6, 7 తేదీల్లో జరిగే శ్రీరామనవమి, రాములవారి మహా పట్టాభిషేకానికి భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార, సౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. ఆదివారం భద్రాచలం ఆర్‌డిఒ కార్యాలయంలో శ్రీ రామనవమి, పట్టాభిషేకం, ఏర్పాట్లపై మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యుడు పోరిక బలరాం నాయక్, స్థానిక ఎంఎల్‌ఎ తెల్లం వెంకట్రావ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్‌తో కలిసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. కలెక్టర్ నవమి ఏర్పాట్లకు వివిద శాఖల ద్వారా చేపడుతున్న పనులు, తీసుకుంటు న్న చర్యలను మంత్రికి వివరించారు. అనంతరం మంత్రి మా ట్లాడుతూ… మూడు రోజుల్లో మాడవీధుల స్థల సేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామని అన్నారు.

రామనవమి రోజున సిఎం చేతుల మీదుగా మాడవీధుల పనుల విస్తరణ పనులకు ప్రారంభోత్సవం జరుగుతుందని అన్నారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేసి నవమికి విచ్చేసే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎండ వేడి అధికంగా ఉన్నందువల్ల భక్తులకు పందిరిలో పాటు గుడి పరిసర ప్రాంతాలు చుట్టూ తాగునీటి ఏర్పాటు, మజ్జిగ ప్యాకెట్లు భక్తులకు అందించాలని ఆదేశించారు. నిరంతరం విద్యుత్ సరఫరా జరిగేలా అవసరమైన చర్యలు చేపట్టాలని అన్నారు. వైద్యశాఖ సిబ్బంది అవసరమైన మందులు, అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని, అవసరమైతే వేరే జిల్లాల నుంచి అధనంగా సిబ్బందిని డిప్యుటేషన్‌పై తీసుకోవాలని ఆదేశించారు. వైద్యశాఖలో అనుభవజ్ఞులైన సిపిఆర్ నిపుణులను నియమించాలని ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది అవసరమైన ఫైర్ ఇంజన్లను సిద్ధం చేసుకోవాలన్నారు. ఈ సమీక్ష సమావేశంలో ఐటిడిఎ పిఒ రాహుల్, భద్రాచలం ఎఎస్‌పి విక్రాంత్‌కుమార్ సింగ్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యాచందన, ఆర్‌డిఒ దామోదర్‌రావు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News