Sunday, December 22, 2024

జులై 14న తెలుగులో ‘నాయకుడు’గా ‘మామన్నన్’

- Advertisement -
- Advertisement -

ఉదయనిధి స్టాలిన్, వడివేలు మరియు ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలు పోషించిన తమిళ చిత్రం ‘మామన్నన్‌’. పరియేరుమ్ పెరుమాల, కర్ణన్ లాంటి విజయవంతమైన చిత్రాలు అందించిన మరి సెల్వరాజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.
మామన్నన్ సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. దీనితో దర్శకుడు హ్యాట్రిక్ హిట్స్ కంప్లీట్ చేయనున్నారు.

తెలుగులో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థలు ఏషియన్ మల్టీప్లెక్స్ ప్రైవేట్ లిమిటెడ్, సురేష్ ప్రొడక్షన్స్,  కీర్తి సురేష్ కూడా నటించిన ఈ చిత్రం తెలుగు హక్కులను పొందాయి. ‘నాయకుడు’ అనే టైటిల్‌తో ఈ చిత్రం జూలై 14న తెలుగు రాష్ట్రాల థియేటర్లలో విడుదల కానుంది. ఈ చిత్రం తమిళంలో అద్భుతాలు చేయడంతో పాటు, ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ హౌస్‌లు దీనికి మద్దతు ఇవ్వడంతో ‘నాయకుడు’ తెలుగులో గ్రాండ్ రిలీజ్ అవుతుంది. విడుదల తేదీ పోస్టర్ లో వడివేలు, ఉదయనిధి స్టాలిన్, ఫహద్ ఫాసిల్,  కీర్తి సురేష్‌ల ముఖాల్లో ఇంటెన్సిటీ మన దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ఉదయనిధి పూర్తి స్థాయి రాజకీయ జీవితాన్ని చేపట్టే ముందు నటుడిగా చేసిన చివరి చిత్రం కావడం విశేషం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News