Wednesday, January 15, 2025

‘హరిహర మీరమల్లు’ నుంచి ఫస్ట్ సాంగ్ ప్రోమో వచ్చేసింది..

- Advertisement -
- Advertisement -

ఏపీ డిప్యూటీ సిఎం, పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు సంక్రాంతి కానుక వచ్చేసింది. పవన్ నటిస్తున్న పిరియాడిక్ యాక్షన్ ఎంటర్ టైనర్ చిత్రం ‘హరి హర వీరమల్లు’. ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఈ సినిమాలో పవన్ పాడిన సాంగ్ ప్రోమోను మంగళవారం మేకర్స్ విడుదల చేశారు.

‘వినాలి.. మీరమల్లు మాట చెబితే.. వినాలి’ అంటూ పవన్ చెప్పిన డైలాగ్ తో ప్రొమోను వదిలారు. ‘మాట వినాలి’ అంటూ సాగే ఈ పాట పూర్తి లిరికల్ వీడియోని జనవరి 17న ఉదయం 10.20గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఎ ఎం రత్నం భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో హాట్ బ్యూటీ నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ సినిమా విడుదల తేదీపై త్వరలోనే మేకర్స్ క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News