Thursday, January 23, 2025

‘డెవిల్’ నుంచి ఫస్ట్ సింగిల్ ‘మాయే చేశావే’ రిలీజ్..

- Advertisement -
- Advertisement -

నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం ‘డెవిల్’. ‘బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్’ ట్యాగ్ లైన్. ప్రముఖ నిర్మాణ సంస్థ అభిషేక్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ మూవీలో కళ్యాణ్ రామ్ సరసన సంయుక్త మీనన్ నటిస్తోంది. ఇప్పటికే విడుదల చేసిన ఈ మూవీ టీజర్‌కి అమేజింగ్ రెస్పాన్స్ రావటంతో పాటు సినిమాపై ఉన్న అంచనాలు మరింతగా పెరిగాయి.

తాజాగా ఈ మూవీ నుంచి ‘మాయే చేశావే..’ అనే పాటను తొలి సాంగ్‌గా మేకర్స్ రిలీజ్ చేశారు. హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రామేశ్వ‌ర్‌ సంగీత సారథ్యంలో స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ‘డెవిల్’ మూవీ నవంబర్ 24న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున్న రిలీజ్ అవుతుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News