Monday, December 23, 2024

అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ పూర్తి

- Advertisement -
- Advertisement -

నితిన్ హీరోగా ఎం.ఎస్. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘మాచర్ల నియోజకవర్గం’. ప్రస్తుతం నితిన్ ఈ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను ఆదిత్య మూవీస్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి శ్రేష్ట్ మూవీస్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ చిత్రం భారీ షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. అనల్ అరసు మాస్టర్ పర్యవేక్షణలో భారీ యాక్షన్ ఎపిసోడ్‌ను రూపొందించారు, ఆ తర్వాత జానీ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన మాస్ డ్యాన్స్ పూర్తయింది. ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్ వివరాలు త్వరలో రాబోతున్నాయి. నితిన్ ట్విట్టర్లో పోస్ట్ చేస్తూ, ‘అనల్ అరసు మాస్టర్ కంపోజ్ చేసిన అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్ షూటింగ్ పూర్తయింది. జానీ మాస్టర్ సాంగ్ కూడా ముగిసింది’ అని అన్నారు. ఈ సినిమాలో నితిన్ సరసన కృతి శెట్టి, కేథరిన్ థెరిస్సా హీరోయిన్లుగా నటిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో నితిన్ మునుపెన్నడూ చూడని యాక్షన్ రోల్‌లో కనిపించనున్నాడు. భీష్మ, మాస్ట్రో చిత్రాల తర్వాత మహతి స్వర సాగర్ మూడవసారి నితిన్‌తో కలిసి పనిచేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News