Thursday, January 23, 2025

‘రా రా రెడ్డి’ అదిరిపోతుంది

- Advertisement -
- Advertisement -

Macherla niyojakavargam song lyrics

హీరో నితిన్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’లోని స్పెషల్ సాంగ్ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. మొదట ఈ పాటలోని అంజలి లుక్‌ను విడుదల చేశారు. తర్వాత అదిరిపోయే ప్రోమోని విడుదల చేశారు. స్టార్ నిర్మాత దిల్ రాజు ముఖ్య అతిథిగా హైదరాబద్‌లో ఘనంగా జరిగిన మాస్ మ్యూజిక్ జాతర ఈవెంట్‌లో మాస్ డ్యాన్స్ నంబర్ “రా రా రెడ్డి” లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రోమోలో కొన్ని అద్భుతమైన డ్యాన్సులు కనిపించగా, లిరికల్ వీడియో మరింత అద్భుతంగా, మాస్ వీర లెవల్‌లో ఉంది. విన్నవెంటనే మళ్ళీ మళ్ళీ పాడుకునేలా ఈ పాటని స్వరపరిచారు సంగీత దర్శకుడు మహతి స్వర సాగర్.

నితిన్ ఎనర్జీ, కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ సిగ్నేచర్ డ్యాన్స్ స్టెప్పులు, అంజలి గ్లామర్ ఈ పాటని హైలెట్‌గా నిలిపాయి. కాసర్ల శ్యామ్ అందించిన సాహిత్యం మాస్‌ని మురిపిస్తుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ… జయం చిత్రంతో మొదలైన నితిన్ ప్రయాణం ఇరవై ఏళ్ళు పుర్తయింది. ఇది మామూలు విషయం కాదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఎక్కువ హీరోలు ఉన్నారు. ఇంత కాంపిటేషన్‌లో సక్సెస్ ఫుల్‌గా ఉండటం గొప్ప విషయం. నితిన్ మరిన్ని విజయాలతో ముందుకు వెళ్ళాలి. అంజలి మంచి నటి. ఇప్పుడు ఐటెం సాంగ్స్ తో మిమ్మల్ని అలరిస్తుంది. ఆగస్ట్ 12న విడుదలవుతున్న ఈ చిత్రం ప్రేక్షకులందరికీ నచ్చాలి” అని కోరుకున్నారు అని అన్నారు.

నితిన్ మాట్లాడుతూ.. అభిమానులు ఎప్పుడూ డ్యాన్స్ సాంగ్స్ చేయమని అడుగుతుంటారు. వారి కోసమే ఈ చిత్రంలో హెవీ డ్యాన్స్ నెంబర్స్ పెట్టాం. లిరికల్ వీడియోలో వున్నది సాంపిల్ మాత్రమే ఈ సినిమా లో “రా రా రెడ్డి” పాట అదిరిపోతుంది అని చెప్పా రు. దర్శకుడు రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ… సక్సెస్‌కి కేరాఫ్ అడ్రస్ అయిన దిల్ రాజు చేతులుమీదగా మా ఫస్ట్ ఈవెంట్ జరగడం ‘మాచర్ల నియోజకవర్గం’ సూపర్ హిట్ అవుతుందనే కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధిస్తుందని మా టీం అంతా నమ్మకంగా వున్నాము అని పేరొన్నారు. ఈ కార్యక్రమంలో అంజలి, కృతిశెట్టి, సంగీత దర్శకుడు మహతి స్వరసాగర్, కాసర్ల శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News