Wednesday, January 22, 2025

‘మాచర్ల నియోజకవర్గం’ బ్లాక్‌బస్టర్ హిట్టవుతుంది: అనిల్ రావిపూడి

- Advertisement -
- Advertisement -

హీరో నితిన్ మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్ ‘మాచర్ల నియోజకవర్గం’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన చార్ట్‌బస్టర్ పాటలు, ‘మాచర్ల యాక్ష న్ ధమ్కీ’ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచా యి. గుంటూరులోని బ్రోడీపేట్‌లో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ‘మాచర్ల నియోజకవర్గం’ థియేట్రికల్ ట్రైలర్‌ను లాంచ్ చేశారు బ్లాక్ బస్టర్ దర్శకుడు అనిల్ రావిపూడి. ట్రైలర్ రిలీ జ్ ఈవెంట్‌కి అభిమానులు భారీగా హాజరయ్యారు. రారా రెడ్డి పాటలోని ‘రానురాను అంటుంది చిన్నదోయ్’ పాపులర్ బిట్ కి నితిన్ తో పాటు కృతి శెట్టి, కేథరిన్ థ్రెసా, అనిల్ రావిపూడి స్టేజ్ మీద డ్యాన్స్ చేయడం అభిమానులని అలరించింది. ఈ వేడుకలో నితిన్, కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా, సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి, సముద్రఖని, కాసర్ల శ్యామ్, జానీ మాస్టర్ తదితరలు పాల్గొన్నారు.రెండు నిమిషాల యాభై సెకన్లు నిడివి గల ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా మైండ్ బ్లోయింగ్ అనిపించింది. నితిన్, కృతి శెట్టిల లవ్లీ ఎంట్రీతో కూల్‌గా మొదలైన ట్రైలర్.. వెన్నెల కిషోర్, రాజేంద్ర ప్రసాద్, మురళీ శర్మల పంచిన హాస్యంతో పర్ఫెక్ట్ ఫ్యామిలీ వినోదం అందించింది. కలెక్టర్ సిద్ధార్థ్ రెడ్డిగా నితిన్ మాచర్లలోకి ఎంటరవ్వడంతో కంప్లీట్ యాక్షన్‌తో మాస్ ఫీస్ట్‌గా మైమరిపించింది. ఈ చిత్రాన్ని శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి భారీ నిర్మిస్తున్నారు. రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్న ఈ చిత్రానికి ఎమ్.ఎస్.రాజ శేఖర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కృతిశెట్టి, కేథరిన్ థ్రెసా కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి స్పెషల్ నంబర్ రారా రెడ్డిలో సందడి చేస్తోంది. మాచర్ల నియోజక వర్గం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో హీరో నితిన్ మాట్లాడుతూ.. ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ ఎలా వుందో సినిమా కూడా అంతే ఎంటర్ టైనర్‌గా వుంటుంది. ఈ సినిమాలో పాటలని హిట్ చేశారు. అలాగే సినిమాని కూడా చూసి పెద్ద హిట్ చేయండి. కృతిశెట్టి, కేథరిన్ థ్రెసాతో పని చేయడం ఆనందంగా వుంది. సంగీత దర్శకుడు సాగర్ మంచి పాటలు, నేపథ్య సంగీతం ఇచ్చారు. అని అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. మాచర్ల నియోజకవర్గం ట్రైలర్ చూస్తుంటే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందనిపిస్తుంది. ఈ మధ్య కాలంలో ఇంత మాస్ యాక్షన్ చూడలేదు. అదిరిపోయే మాస్ వైబ్ ఇచ్చింది ‘మాచర్ల నియోజకవర్గం’ ట్రైలర్ అని తెలిపారు. కృతి శెట్టి మాట్లాడుతూ నితిన్ రారా రెడ్డి పాటకు డ్యానర్స్ చేస్తుంటే, ఈ చిత్రం పనిచేయడం చాలా అనందాన్ని ఇచ్చింది’ అని అన్నారు.

Macherla Niyojakavargam’ Trailer Launch Event’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News