Monday, January 20, 2025

26,28న మెషిన్ లెర్నింగ్ అధ్యాపక వికాస కార్యక్రమం

- Advertisement -
- Advertisement -

అమీన్‌పూర్: గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని ఈఈసీఈ విభాగం ఆధ్వర్యంలో 26-, 28 తేదీలలో ‘మెసిన్ లెర్నింగ్ వికాస – ఇట్స్ అప్లికేషన్స్ ఇన్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ’ అనే అంశంపై మూడు రోజుల అధ్యాపక కార్యక్రమాన్ని (ఎస్టీపీ) నిర్వహిస్తున్నట్టు నిర్వాహకులు ప్రొఫెసర్ టి.మాధవి, ప్రొఫెసర్ కె. మంజునాథాచారి సోమవారం సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటనలో వెల్లడించారు. -మెడిన్ లెర్నింగ్ అల్గారిథములను ఇంజనీరింగ్, టెక్నాలజీ కి ఎలా అన్వయించవచ్చో అర్ధం చేసుకోవడానికి అవసరమైన జ్ఞానం, నైపుణ్యాలతో పాల్గొనేవారిని సన్నద్ధం చేయడానికి దీనిని రూపొందించినట్టు వారు తెలిపారు. ఇందులో పాల్గొనేవారు ఆచరణాత్మక అవగాహనతో శిక్షణ పొందడమే గాక పరిశోధన సహకారం కోసం ఇతర గ్రూపుల సహకారం కోరవచ్చని చెప్పారు.

మెషిన్ లెర్నింగ్ ప్రాథమిక లక్ష్యం కంప్యూటర్ సిస్టమ్లను రూపొందించడం, డేటాలోని సంక్లిష్ట నమూనాలు, సంబంధాలను విశ్లేషించి అర్థం చేసుకోవడం, ఖచ్చితమైన అంచనాలను రూపొందించడానికి, చర్యలు తీసుకోవడానికి వీలు కల్పించడమన్నారు. ఈ పద్ధతులను వినియోగించి కొత్త సమస్యలను సులువుగా పరిష్కరించగలిగే ఆచరణాత్మక జ్ఞానాన్ని పొందచ్చని నిర్వాహకులు తెలియజేశారు. ఈ ఎఫ్‌ఎసిని విద్యావేత్తలు, పరిశోధన స్కాలర్లు, బీటెక్, ఎంటెక్, ఎమ్మెన్సీ చదివే వారికోసం ఉద్దేశించామని, ఆసక్తి ఉన్నవారు తమ పేర్లను ఈ లింక్ http s://forms. gle/aimM5hby3LSUfxd8 link ద్వారా 26వ తేదీలో పు నమోదు చేసుకోవచ్చన్నారు. ఇతర వివరాల కోసం కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ పీవీ రామకృష్ణ 81060 21619ని సంప్రదించాలని, లేదా rpuvvula@gitam.edu కు ఈ-మెయిల్ చేయాలని వారు సూచించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News