Monday, December 23, 2024

ఆ యూట్యూబ్ ఛానళ్లు రద్దు: ‘మా’

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అసత్య వార్తలను పోస్ట్ చేస్తున్న ఐదు యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేయించినట్లు మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) తెలిపింది. జస్ట్ వాచ్ బిబిసి, ట్రోల్స్ రాజా, బచినా లలిత్, హైదరాబాద్ కుర్రాడు, ఎక్స్ వైజెడ్ఎడిట్ 007 అనే యూట్యూబ్ ఛానళ్లను రద్దు చేసినట్లు ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు తెలిపారు. ఇది ఆరంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని ఛానళ్లను కట్టడి చేయనున్నట్లు హెచ్చరించారు. ఇటీవల ఓ తండ్రి-కుమార్తె పై అసభ్యకర వ్యాఖ్యలు చేస్తూ వీడియో పోస్టింగ్ చేశారని తెలిపారు. ‘‘ట్రోలింగ్ వీడియోలు చేసే వారికి, అసభ్యకర వీడియోలు పెట్టే వారికి రెండు రోజుల సమయం ఇస్తున్నామని, అలాంటి వీడియోలను తొలగించాలని లేకుంటే వారి పనిపడతాం’’ అని హెచ్చరించారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News