Sunday, December 22, 2024

ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మెక్రాన్‌‌పై టమోటాతో దాడి!

- Advertisement -
- Advertisement -

Macron attacked by Tomatoes

పారిస్:  ఫ్రాన్స్‌ అధ్యక్షుడు ఇమ్మాన్యూయెల్ మెక్రాన్‌‌కు చేదు అనుభవం ఎదురైంది. తాజాగా రెండోసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఓ పబ్లిక్ ఈవెంట్‌లో పాల్గొన్నారాయన. సెర్జీలోని ఓ పండ్ల మార్కెట్‌కు వెళ్లారు. దాంతో ఆయనను చూసేందుకు జనాలు ఎగబడ్డారు. ఆ జనాల గుంపులోంచి ఓ వ్యక్తి మెక్రాన్‌పై టమోటా విసిరాడు. అది అధ్యక్షుడికి కొద్దిలో తప్పిపోయింది. దాంతో వెంటనే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది మెక్రాన్‌ చుట్టు రక్షణ వలయంగా ఏర్పడడంతో పాటు ఓ గొడుగుతో ఆయనను కవర్ చేశారు. అనంతరం అక్కడి నుంచి అధ్యకుడిని సురక్షిత ప్రదేశానికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు రావడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ట్విటర్‌లో ఈ వీడియోకు 1.5 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఇక ఇటీవలే మెక్రాన్ తన ప్రత్యర్థి మరీన్ లీ పెన్‌‌పై ఘన విజయం సాధించి వరుసగా రెండోసారి అధ్యక్ష పీఠం దక్కించుకున్న సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News